ఐడియా

వెల్డర్ కొడుక్కి.. 1.02 కోట్ల వేతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్డర్‌గా పనిచేసే తండ్రి సంపాదన అంతంత మాత్రమే.. కటిక దారిద్య్రం.. గ్రామీణ నేపథ్యం.. ఇన్ని సమస్యల నడుమ చదువుపైనే దృష్టి సారించిన ఆ కుర్రాడు ఇపుడు ఒక్కసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. బిహార్‌లో అత్యంత వెనుకబడిన ఖగారియా ప్రాంతంలోని సాన్‌హౌలి గ్రామానికి చెందిన వాత్సల్యసింగ్ చౌహాన్‌కు ఐటి దిగ్గజమైన ‘మైక్రోసాఫ్ట్’లో 1.02 కోట్ల రూపాయల జీతానికి మంచి ఉద్యోగం దక్కింది. 21 ఏళ్ల వాత్సల్య ప్రస్తుతం ఖరగ్‌పూర్ ఐఐటిలో బీటెక్ చివరి సంవత్సరంలో ఉండగా ఈ భారీ ఆఫర్ వరించింది. దినసరి వేతనంపై వెల్డర్‌గా పనిచేసే వాత్సల్య తండ్రి చంద్రకాంత్ ఆనందానికి ఇపుడు అవధులు లేకుండా పోయాయి. పనె్నండవ తరగతిలో 75 శాతం మార్కులు సాధించిన ఈ కుర్రాడు ఐఐటిలో సీటు సాధించేందుకు 2011లో రాజస్థాన్‌లోని కోటలో కోచింగ్ తీసుకున్నాడు. ఐఐటి-జీ ప్రవేశపరీక్షలో జాతీయ స్థాయిలో 382వ ర్యాంకు సాధించి ఖరగ్‌పూర్ (పశ్చిమబెంగాల్) ఐఐటిలో చేరాడు. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చదువుతున్న వాత్సల్య తన చదువు కోసం ఓ బ్యాంకు నుంచి మూడున్నర లక్షల రుణం తీసుకున్నాడు. మైక్రోసాఫ్ట్‌లో భారీ జీతంపై వాత్సల్యకు మంచి ఉద్యోగం వచ్చిందన్న విషయం తెలిశాక ఇక తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవని చంద్రకాంత్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
*