ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్మం ఎర్రగా మారిపోవడం, మంట పుట్టడం, దద్దుర్లు, పొలుసులు దేరడం, తేమను కోల్పోవడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే ఎగ్జిమా, సొరియాసిస్ వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలను పాటిస్తే చర్మసంబంధ సమస్యల నుంచి ఆదిలోనే గట్టెక్కే అవకాశం ఉంది. ముందుగా చేతులను పరిశుభ్రం చేసుకున్నాక చర్మం పొడిగా ఉన్న చోట కొబ్బరి నూనెను మృదువుగా రాసుకోవాలి. చర్మంపై మంటగా ఉన్నా, కందిపోయినట్టు ఉన్నా నాణ్యమైన తేనె రాసుకోవాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొద్దిరోజుల పాటు ఇలా చేస్తే చర్మంపై మంట, ఎరుపుదనం తగ్గుతాయి. మొక్కజొన్న పిండిలో కాస్త కొబ్బరి నూనె కలిపి పేస్టులా చేసుకుని చర్మానికి పట్టిస్తే దురదలు తగ్గుతాయి. కలబంద రసాన్ని చర్మానికి తరచూ రాసుకుంటే దద్దుర్లు, నల్లమచ్చల నుంచి విముక్తి లభిస్తుంది. కలబంద రసాన్ని విటమిన్-ఇ ఆయిల్‌తో కలిపి రాసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది. క్యారెట్ దుంపలను బాగా ఉడకబెట్టి ముద్దలా చేసుకుని చర్మానికి పట్టించి అరగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు కొమ్ములను అరగదీసి కాసిన్ని నీళ్లు కలిపి పేస్టులా చేసుకుని శరీరానికి రాసుకుంటే చర్మంపై మంట, ఎరుపుదనం తగ్గుతాయి. హానికారక బ్యాక్టీరియాలపై పోరాడే శక్తి పసుపులో ఉంది. రోజూ రెండు పూటలూ స్నానం చేస్తే చర్మంపై మురికిదనం పోతుంది.