ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెయిల్ పాలిష్ వేసుకోవడం పూర్తయ్యాక- వేడి నీటి ఆవిరి తగిలేలా అర నిమిషం పాటు వేళ్లను ఉంచితే గోళ్ల అందం మరింతగా ఇనుమడిస్తుంది. సీసాలో గోళ్ల రంగు గట్టిపడితే దాన్ని గోరువెచ్చని నీరు పోసిన గినె్నలో కాసేపు ఉంచాలి. ఇలా చేస్తే గోళ్లరంగు మెత్తబడి మళ్లీ వాడుకోవడానికి వీలుగా మారుతుంది. ఎండిపోయిన గోళ్లరంగులో రెండు, మూడు చుక్కల టర్పైన్‌టెన్ వేస్తే మెత్తబడుతుంది. నెయిన్ పాలిష్ వేసుకున్న తర్వాత వేళ్లను చల్లటి నీటిలో కాసేపు ఉంచితే పాలిష్ తొందరగా ఆరిపోతుంది. మెరిసే నెయిల్ పాలిష్ చర్మంపై అంటుకోకుండా గోళ్లకు వేసుకోవాలంటే దూదికి బదులు స్టీల్ బిల్లో ప్యాడ్‌తో తుడిచేసుకోవాలి. నెయిల్ పాలిష్ లేదా నెయిల్ ఆర్టు వేసుకున్నపుడు గోళ్ల చుట్టూ చర్మానికి ఆలివ్ నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి పాలిష్ అంటుకున్నా వెంటనే దాన్ని తొలగించుకునే అవకాశం ఉంది. నెయిల్ స్టిక్కర్లను అతికించుకుంటే వాటిని గోళ్ల చివరి వరకూ అంటుకునేలా ఉంచాలి. ఇలా చేస్తే గోళ్లకు ఇబ్బంది లేకుండా స్టిక్కర్లను తీసివేయవచ్చు.