ఐడియా

చలికాలానికి అనువైన సూప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీర్ణవ్యవస్థ మెరుగయ్యేందుకు భోజనానికి ముందు చాలామంది పలురకాల సూప్‌లు తీసుకుంటారు. చలికాలంలో వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు, ఫ్లూ జ్వరాలు, దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండేందుకు తులసి ఆకులు, టమాటాలతో చేసే సూప్ తాగడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయిదారు టమాటా పండ్లను ముక్కలుగా కోసి, అందులో పావుకప్పు తులసి ఆకులు, పావుకప్పు రాజ్‌మా చిక్కుళ్లను, కాస్త ఉప్పు, మిరియాల పొడి కలిపి బాగా ఉడికించాలి. ఆ తర్వాత వేడిచేసిన పెనంపై వెన్న వేసి, ముందుగా ఉడికించిన టమాటా మిశ్రమాన్ని కలపాలి. అవసరమైతే కాసిన్ని నీళ్లు కలుపుకోవచ్చు. చలికాలానికి ఎంతో అనువైన ఈ సూప్ దృష్టి సంబంధ సమస్యల్ని, శరీరంలో క్యాన్సర్ కారకాలను నివారిస్తుంది.