ఐడియా

జీర్ణక్రియకు ఆయుర్వేద చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం చాలామందిలో వున్న సమస్య జీర్ణక్రియ. మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవన విధానం కారణంగా జీర్ణక్రియ సమస్య తలెత్తుతోంది. అన్నం అరగకపోవడం, అజీర్తి చేయడం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. వీటినుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్ దగ్గరికో, ఔషధ దుకాణానికో వెళ్లాల్సిన పనిలేదు. ఇంటివద్దే సులభమైన ఆయుర్వేద పద్ధతుల ద్వారా జీర్ణక్రియ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- రోజంతా వేడినీళ్లనే తాగండి. భోజనం చేసినపుడు కూడా వేడినీళ్లే తీసుకోండి.
- తినేటప్పుడు వేరే ఏ పనులూ పెట్టుకోకండి. మంచి వాతావరణంలో కింద కూర్చొని ఆహారం తీసుకోండి. తినేటప్పుడు టీవీ చూడకండి.
- భోజనం చేయడానికి ముందు తాజాగా వున్న చిన్న అల్లం ముక్క, కొంచెం నిమ్మరసం తీసుకోండి.
- మధ్యాహ్న భోజన సమయంలో ఒక గ్లాసు లస్సీ తాగితే మంచిది.
- శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్, చల్లని ఆహార పదార్థాలను దూరం పెట్టండి.
- మధ్యాహ్న భోజనాన్ని పుష్టిగా చేయండి. రాత్రి భోజనం మాత్రం మితంగా తీసుకోండి. 9 గంటలలోపే డిన్నర్ చేయడం మంచిది.
- భోజనం చేసిన తరువాత కాస్త విశ్రాంతి తీసుకోండి. ఊపిరి బాగా పీల్చండి. అలాగే కాస్త నడవండి. రోజూ ఈ విధంగా చేస్తే మీ జీర్ణప్రక్రియ బాగా జరుగుతుంది. అజీర్తి, గ్యాస్ట్రిక్, కడుపుమంట తదితర ఉదర సమస్యలు దూరమవుతాయి.