ఐడియా

మెటబాలిజం పెరగాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరం శక్తి ఖర్చు చేసే వేగమే మెటబాలిజం. ఈ వేగం మన ఆహారపుటలవాట్లు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. మెటబాలిజాన్ని పరిగెత్తించగలిగితే శరీరంలో కొవ్వు పేరుకునే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి అందుకు ఉపయోగపడే అలవాట్లను అలవరుచుకోవాలి. అవేంటంటే..
* మెటబాలిజం చురుగ్గా ఉండాలంటే కంటినిండా నిద్ర తప్పనిసరి. కాబట్టి రోజుకు ఎనిమిది గంటలకు తగ్గకుండా ప్రశాంతంగా నిద్ర పోవాలి.
* వ్యాయామం తర్వాత కూడా మెటబాలిజం వేగంతో పనిచేయాలంటే హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ చేయాలి. దీనే్న ‘ఆఫ్టర్ బర్న్ వర్కవుట్’ అంటారు.
* డైటింగ్‌తో కడుపు మాడ్చుకుంటూ, హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ చేస్తే అందుకు సరిపడా శక్తి అందక బలహీనపడతాం. ఇందుకు కారణం డైటింగ్ సమయంలో, శక్తిని పొదుపు చేసుకోవడం కోసం శరీర జీవక్రియలను మందగింపజేయాలనే మెసేజ్ మెదడు నుంచి మెటబాలిజాన్ని చేరడమే..
* బరువులు ఎత్తడం వల్ల లీన్ మజిల్ మాస్ తయారవుతుంది. కాబట్టి నిద్రావస్థలో ఉన్న మెటబాలిజం మేల్కొనేలా బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి.
* జీర్ణశక్తి మందగించే ఆహారానికి దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహాంరం వల్ల ఫ్రీ రాడికల్స్ పెరిగి మెటబాలిజం కుంటుపడుతుంది. కాబట్టి తేలిగ్గా అరుగుతూ, స్వల్ప పరిమాణాల్లో గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేసే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి.