ఐడియా

సంప్రదాయమే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ అందంగా ఉండాలనే ఉంటుంది. అందం విషయంలో ఎవరైనా సరే అందరికన్నా కాస్త ఎక్కువగా ఉండాలని అందరిలో నిలబడినపుడు తననే ప్రత్యేకంగా చూడాలని అందరూ సహజంగా అనుకొంటారు.
ఈవిషయాన్ని తెలుసుకొన్న మార్కెటు నిపుణులు ఇపుడు రెడీమేడ్ మాస్క్ అంటే మాస్క్ షీట్‌ను విడుదల చేశారు. వీటిని వివిధ రకాల పండ్ల రసాల్లో ముంచి ఉంటారు. ఎవరు ఏది కోరుకుంటే దానిని ముఖానికి అంటించుకోవచ్చుఅన్నమాట. ఈ మాస్క్‌షీట్‌ను కవర్‌లోంచి తీసిన తర్వాత ముఖానికి అంటించుకుని కొద్ది గంటల లేదా కొద్ది నిముషాల తర్వాత దానిలో సూచించినట్లు తీసివేస్తే ముఖం కాంతివంతంగా కనిపిస్తుందంటారు.
ఇదంతా కృత్రిమ సౌందర్యసాధనమే. ఇట్లాంటివి కొన్నాళ్లే పనిచేస్తాయి. అట్లాకాకుండా నిత్యమూ సౌందర్యవంతంగాను, ఆకర్షణీయంగా, కాంతివంతంగా ఉండాలి అనుకొంటే సంప్రదాయ పద్ధతులే మేలు. నిత్యమూ స్నానానికి వెళ్లే పది పదిహేను నిముషాల ముందు పాల మీద పేరుకున్న మీగడను ముఖానికి పట్టించుకోవాలి. ఆ తరువాత సున్నిపిండితో రుద్దుకుని స్నానం చేస్తే ఆ ముఖానికి ఉన్న మెరుపు ఏ సౌందర్యసాధనంతోను రాదు. అట్లాగే మనం రోజు కూరల్లో వాడుకునే దోస, టమాట, నిమ్మకాయ వంటివి రసం తీసి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తరువాత చల్లనినీటితో కడుక్కుంటూ ఉంటే చర్మం ముడతలు కూడా రాకుండా చాలా కాంతిగా కనిపిస్తుంది. ఈ పండ్లరసాలు వారానికి ఒకసారి పట్టించుకున్నా చాలు.
అట్లానే క్యారెటు రసం, సొరకాయ వంటి కాయల రసం తీసుకొని పూసుకొంటూ ఉంటే కూడా మంచి మెరుపు ముఖానికి వస్తుంది. కేవలం ముఖానికే కాక చేతులకు, మెడమీద కూడా వీటిని పూసుకోవడం వల్ల మెడ మీద పట్టే నలుపును దూరం చేసుకోవచ్చు. మోచేతుల్లో నలుపును కూడా దూరం చేసుకోవచ్చు.

- లక్ష్మీప్రియాంక