ఐడియా

పులిపిర్ల నివారణ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులిపిరి కాయల సమస్య ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. వీటిని ఉలిపిరి కాయలు అని కూడా అంటారు. ఆంగ్లంలో వీటిని వార్ట్స్ అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిరులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలపై వస్తుంటాయి. చర్మంతో కలిసిపోయే కొన్ని పులిపిర్లు పెద్దగా నొప్పిరావు. కొన్ని పులిపిర్లు మాత్రం దురద పెడుతుంటాయి.
రకాలు
చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అంటారు. పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటార్ వార్ట్స్ అంటారు. ముఖం, మెడపై వచ్చే పులిపిర్లను ప్లాట్ వార్ట్స్ అని అంటారు. కొంతమంది జననాంగాలపై కూడా పులిపిర్లు ఏర్పడతాయి. వీటిని జనైటర్ వార్ట్స్ అని పిలుస్తారు.
వైరల్ వల్ల..
రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్లను కత్తిరించడం, కాల్చడం వంటివి చేయకూడదు. ఇవి ఎక్కువగా రాపిడిగా ఉన్న ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. ఇంటి చిట్కాలు లేదా వైద్యులను సంప్రదించి వీటిని తీసేయించుకోవచ్చు. దాదాపుగా ఇంటి చిట్కాల ద్వారానే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
* ఆపిల్ సిడార్ వెనిగర్‌లో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజసిద్ధంగా తగ్గిపోతాయి. దూదిని ఆపిల్ సిడార్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లు ఉన్నచోట అద్దితే చాలు. వారంలో కనీసం ఐదు రోజుల పాటు ఇలా చేస్తే ఇవి పూర్తిగా మాయమవుతాయి.
* కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకోసం కలబంద ఆకు మధ్యలోని జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు.
* ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్‌ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేసి, రాత్రంతా అలా వదిలేయాలి. ఉదయానే్న బ్యాండేజ్ తీసేయాలి. రెండు, మూడు రోజులు ఇలా చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.
* అరటి పండు తొక్కలో ఉండే ఎంజైములు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అరటిపండు తొక్కతో రోజూ పులిపిర్లపై రుద్దితే అవి క్రమేనా కనుమరుగవుతాయి.
* చర్మవ్యాధుల నివారణకు వెల్లుల్లి మంచి ఔషధం. ఇందులో ఉండే ఎల్లిసిస్.. ఫంగస్, వైరస్ వంటి బాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకుగాను వెల్లుల్లిని ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాయాలి. జాగ్రత్త ఈ మిశ్రమాన్ని సాధారణ చర్మానికి తగిలించకూడదు. లేకపోతే బొబ్బలు వచ్చేస్తాయి.