ఐడియా

చుండ్రు తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గసగసాలను పాలతో నూరి, తలకు లేపనంగా వేస్తే చుండ్రు తగ్గుతుంది.
* మందార పూల రసానికి సమంగా నువ్వుల నూనెను చేర్చి, నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచాలి. ఆ నూనెను తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
* మామిడి జీడి, కరక పలుపు ఈ రెండింటినీ సమాన భాగాలుగా తీసుకుని పాలతో నూరి తలపై లేపనం వేస్తే చాలా త్వరితంగా చుండ్రు సమస్య తొలగిపోతుంది.
* గురివింద గింజల పొడిని, నీటితో ముద్దగా చేసి, దానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె, నూనెకు నాలుగు రెట్లు గుంటగలగర ఆకు రసాన్ని కలిపి నూనె మిగిలేంత వరకు కాచాలి. ఆ తైలాన్ని లేపనంగా పెడితే దురద, చుండ్రు తగ్గుతాయి.
* వేపనూనె, కానుగనూనె సమంగా కలిపి అందులో కొంచెం కర్పూరం వేసి రాస్తే చుండ్రు చాలా వేగంగా తగ్గుతుంది.
* మెంతులను పెరుగుతో నూరి తలకు పట్టిస్తే చుండ్రు బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.