ఐడియా

పట్టుబట్టలు పదిలం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభకార్యాల వేళ పట్టు బట్టలు ధరించడం మన సాంప్రదాయం. అయితే.. సాధారణంగా పట్టుబట్టలపై మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు. అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బు పోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి పది కాలాల పాటు మన్నికగా ఉంటాయి.
జాగ్రత్తలు
* పట్టుచీరలను చెరువు, నది నీటితోనే ఉతకాలి.
* బోరు నీటితో ఉతికేవారు ఆ నీటిలో చిటికెడు బోరాక్స్ కలపాలి.
* నాణ్యమైన, తేలికపాటి సబ్బును ద్రవ లేదా పొడి రూపంలో వాడాలి.
* బోరునీరైతే తేలికపాటి డిటర్జెంట్ వాడాలి.
* పట్టుబట్టలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి నీడపట్టున ఆరేయాలి.
* పట్టు బట్టలపై కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడినీటిలో కొద్దిగా హైడ్రొజన్ పెరాక్సైడ్ వేసి ఆ నీటితో ఉతకాలి.
* పట్టుబట్టలపై ఇంక్ లేదా లిప్‌స్టిక్ మరకలు పడితే ఆ భాగంలో పేపర్ టవల్‌ను ఉంచి వెనుక నుంచి డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు.
* అదే నెయిల్ పాలిష్ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌లో ముంచితే సరిపోతుంది.
* బురద, మట్టి మరకలు పడితే పట్టు వస్త్రాన్ని ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్‌తో తుడిచి ఉతికితే సరిపోతుంది.
* షూ పాలిష్ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్ పూయాలి.
* పట్టుబట్టలను ప్లాస్టిక్ సంచుల్లోగాక పేపర్ లేదా కాటన్ సంచుల్లో ఉంచాలి.
* పట్టుబట్టలున్న చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి.
* పట్టు బట్టలను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా గాక కవరులో పెట్టి పెట్టాలి.
* పట్టుబట్టలను అప్పుడప్పుడూ బయటకు తీసి గాలి సోకనీయాలి. లేకుంటే మడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది.