ఐడియా

కంటి సమస్యలా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం సరైన పోషణ అందకపోవడం లేదా కంటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించకపోవడం.. కంటిచూపు సమస్యకు మందులు వాడి నయం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే పదార్థాలతో మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పైగా దుష్ప్రభావాలు కూడా ఏమీ ఉండవు.
* రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ లేదా వెన్నను కానీ లేదా వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది.
* పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్లు మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుంచి నీరు కారడం, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది.
* కరివేపాకు కూడా కంటిచూపుకు సహకరిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ రెండు కరివేపాకు రెబ్బల్ని తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
* కళ్లకు మేలు చేయడంలో పొన్నగంటికూరకు మించింది లేదు. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే రోజూ ఓ కప్పు పొన్నగంటి ఆకు రసం తాగించాలి.
* ప్రతిరోజూ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఎండు ఫలాలు, చేపలు, గుడ్లు, క్యారెట్, టొమాటో వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది.