ఐడియా

గ్రీన్ టీ కండిషనరా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి వల్ల చిన్నవయస్సులోనే జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. జుట్టు రాలిపోతుండటంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయిత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే జుట్టును సంరక్షించుకునే పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులేంటో చూద్దాం.
* కొబ్బరి నూనె లేదా బాదం నూనెను కొద్దిగా వేడిచేసి తలకు రాయాలి. ఆ తర్వాత మునివేళ్లతో తలను బాగా మర్దనా చేయాలి. దీనివల్ల వెంట్రుకల కుదుళ్లలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.
* ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది. అందుకని ఉల్లిపాయను జ్యూస్‌లా చేసి తలకు పట్టించాలి. మునివేళ్లతో తల మొత్తం మర్దనా చేయాలి. ఉల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల తలలో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి.
* ఒక్కోసారి పోషకాల లోపం వల్ల కూడా జుట్టు ఊడే అవకాశం ఉంది. రోజూ బీట్‌రూట్ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* గ్రీన్ టీని వెంట్రుకలకు కండిషనర్‌లా రాసినట్లయితే వెంట్రుకల కుదుళ్లు బలోపేతం అవుతాయి.
* విటమిన్-సి లోపం వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఈ నేపథ్యంలో ఉసిరి పొడిని తలకు రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది. అందువల్ల చుండ్రు వంటి సమస్యలు తొలగిపోతాయి.
* వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ల్ఫమేటరీలు జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి చుండ్రును నివారించడమే కాకుండా జుట్టు మొదళ్లను బలోపేతం చేస్తుంది. తలంటు పోసుకుని ఆరిన తరువాత వేపాకుల మిశ్రమాన్ని తలకు రాయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.