ఐడియా

మెదడుకు ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి వివిధ ఆహారపదార్థాలు తోడ్పాటును అందిస్తాయి. ఇవి అల్జీమర్స్ వ్యాధి దరిచేరకుండా, స్పష్టంగా ఆలోచించడానికి సహకరిస్తాయి. ఆ ఆహార పదార్థాలేంటో ఒకసారి చూద్దాం.
* ప్రొటీన్లు: నాడీ కణాల మధ్య సమన్వయానికి హై టైరీసిన్ ప్రొటీన్లు ఎంతగానో ఉపకరిస్తాయి. గుడ్డు, సముద్రపు ఆహారం, డైరీ ప్రొడక్ట్స్‌లో ఈ ప్రొటీన్లు ఎక్కువగా దొరుకుతాయి. శాకాహారం మాత్రమే తినేవారికి పప్పు్ధన్యాలు, డైరీ ప్రొడక్ట్స్ ప్రత్యామ్నాయం.
* ఫైబర్: నాడీ కణాలకు గ్లూకోజ్‌ను అందించడంలో ఫైబర్ పాత్ర కీలకమైనది. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఖర్జూరాలు, బీన్స్ వంటి వాటిల్లో ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది.
* విటమిన్స్-మినరల్స్: మెదడుకు కూడా విటమిన్లు, మినరల్స్ అవసరం ఎంతో ఉంది. రోజువారీ ఆహారం ద్వారా లభించే విటమిన్లు, ఖనిజాలతో పాటు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవడం మెదడుకు ఎంతో అవసరం.
* యాంటీ ఆక్సిడెంట్స్: మెదడును ఫ్రీ-రాడికల్స్ నుంచి కాపాడడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతో కృషి చేస్తాయి. గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ, బ్రకోలి, క్యారెట్, వెల్లుల్లి, తృణధాన్యాలు, పెరుగు, అవిసె గింజలు వంటి వాటిల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
* కొవ్వు పదార్థాలు: ఆరోగ్యవంతమైన కొవ్వుపదార్థాలు మెదడుకు ఎంతో అవసరం. ఇతర కొవ్వు పదార్థాలతో పోలిస్తే.. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపల నుంచి లభిస్తాయి. అలాగే గుడ్డు, వాల్‌నట్స్‌లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజల్లో కూడా వీటి స్థాయిలు ఎక్కువే.
* నీరు: ఒక్కోసారి డీ హైడ్రేషన్ వల్ల కూడా మెదడు తన శక్తిని కోల్పోతుంది. కాబట్టి ఎక్కువ నీటిని తాగుతూ ఉండాలి.