ఐడియా

అనర్థమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది ఏళ్లు తరబడి దిండ్లు, దువ్వెనలు, బ్రష్‌లను మార్చరు. అవే కాదు మన ఇంట్లో ఉపయోగించే చాలా వస్తువుల్ని కాలపరిమితి దాటినా కూడా వాడేస్తుంటారు. ఇవి చాలా హానికరం.
* పళ్లు తోముకునే బ్రష్‌ల ఆకృతి చెడిపోయినా, కుచ్చులు అరిగిపోయినా, గట్టిపడినా కూడా వాడేస్తూ ఉంటారు. నిజానికి మూడు నెలలకోసారైనా టూత్‌బ్రష్‌లను మారుస్తూ ఉండాలి. లేదంటే చిగుళ్లు, దంత సంబంధిత సమస్యలు వస్తాయి.
* దిండ్లను రెండు, మూడేళ్లకు మించి వాడకూడదు. ఆపై వాడితే వాటిల్లో చేరిన డస్ట్‌మైట్స్ మనకు అలర్జీలను కలిగిస్తాయి. ఎక్కువగా వాడటం వల్ల వాటి ఆకృతి మారి మెడనొప్పి రావచ్చు.
* దువ్వెనలు ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. వాటిని వారం వారం శుభ్రం చేస్తున్నాం కదా అనుకుంటాం.. కానీ దువ్వెనలను కూడా ఏడాదికోసారి మార్చేయాలి. లేదంటే అవి గట్టిగామారి మాడుకి, జుట్టుకి హాని చేస్తాయి.