ఐడియా

నిద్రపోయేముందు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రకు ఉపక్రమించగానే స్మార్ట్ఫోన్‌ను చేతిలోకి తీసుకుని ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా న్యూస్ ఫీడ్స్, సోషల్ నెట్‌వర్క్స్, చాటింగ్, సంగీతం వినడం మొదలైనవి. ఇలా తెలీకుండానే ఏదో ఒక అంశానికి అడక్ట్ అవడం జరుగుతుంటుంది. క్రమంగా కొన్ని గాడ్జెట్లకు పూర్తిస్థాయిలో అలవాటు పడిపోతారు. ఎంతలా అంటే అర్ధరాత్రుల్లో బాత్‌రూంకని నిద్రలేచినా ఆయా అంశాలను పర్యవేక్షించేలా.. కొందరైతే బాత్‌రూముల్లో కూడా మొబైల్స్‌ను వాడుతుంటారు. ఈ వ్యసనం కారణంగా, ఎక్కువగా నీలికాంతికి కళ్లు ప్రభావితం అవడం జరుగుతుంది. క్రమంగా పొడిబారడం, జీవం కోల్పోవడమే కాకుండా కంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్‌కు కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు కానీ దూరంగా ఉండటం ఉత్తమం. పడుకునేముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే మూత్రాశయం సరైన రీతిలో పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.
దీంతో జీవక్రియలు ఆరోగ్యకరరీతిలో పనిచేస్తాయి. ఫలితంగా నిద్రలో అసౌకర్యం ఉండదు. కానీ అతిమూత్ర వ్యాధి సమస్యలు ఉన్నవారు వీలైనంత తక్కువ నీటిని తీసుకోవాలి. లేకపోతే అర్ధరాత్రి పదే పదే బాత్‌రూముకని లేవాల్సి వస్తుంది.