ఐడియా

రోగనిరోధక శక్తికి నియమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార విషయంలో సరైన అవగాహన, శ్రద్ధ లేకపోవడం వల్ల, ప్రకృతి వైపరిత్యాల వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. అనారోగ్యానికి ప్రధానమైన కారణం మలబద్ధకం. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మలబద్ధకం నుండి తప్పించుకోవచ్చు. తోటకూర, మెంతికూర, పాలకూర మొదలగు ఆకుకూరలు, బీరకాయ, పొట్లకాయ, ముల్లంగి, టమోటా మొదలగు కూరలను, ద్రాక్ష వంటి పండ్లను, ధాన్యముపై ఉండే తౌడును ఉపయోగించడం మంచిది. బలహీనంగా ఉన్నవారు నారింజ, ఆపిల్ మొదలగు పండ్ల రసాలను సేవిస్తే ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగే కొద్దీ కొంచెం కొంచెం ఆహారాన్ని క్రమంగా పెంచి తీసుకోవాలి. తక్కువగా కొవ్వు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి. కాల్షియం, ఐరన్, విటమిన్స్ ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా కలిగిన ఆహారపదార్థాలు తినాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. స్థూల శరీరంతో బాధపడేవారు తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, పిండిపదార్థాలు తగ్గించి, ఆకుకూరలు, పండ్లు, మజ్జిగను ఆహారంగా తీసుకోవాలి. వీలైనంతసేపు నడవడం మంచిది. చెమట ఎక్కువగా పట్టేట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.