ఐడియా

ఒత్తిడి తగ్గించే స్నానాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒత్తిడిని అదుపు చేసుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అందులో పుస్తకాలు చదవడం, సంగీతం వినడం అందరికీ తెలిసినవే.. కానీ స్నానం కూడా ఒత్తిడిని తగ్గిస్తుందని మీకు తెలుసా! స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మెదడుకూడా తేలికపడి హాయిగా అనిపిస్తుంది. అందుకే కాస్త చికాగ్గా అనిపించినా చాలామంది వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అలాంటి రకరకాల స్నానాల గురించి చూద్దాం..
* స్నానం చేసేముందు కప్పు కలబంద గుజ్జులో పావుకప్పు గులాబీరేకల మిశ్రమం, రెండు చెంచాల తేనె, రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి కాసేపు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడుతో పాటు శరీరానికీ సాంత్వన లభిస్తుంది.
* శారీరక అలసట కూడా కొన్నిసార్లు ఒత్తిడికి కారణం అవుతుంది. పావుకప్పు ఆలివ్ నూనె, పావు కప్పు కొబ్బరి నూనెలను కలిపి, రెండింటినీ వేడిచేయాలి. మొదట దీన్ని తలకు కొద్దిగా రాసుకుని మర్దనా చేయాలి. ఆపై ఆవిరిపట్టిన తువాలును తలకు చుట్టేయాలి. మిగిలిన నూనెలో కొంచెం పసుపు, రెండు చెంచాల గులాబీ రేకల ముద్ద, చెంచా పంచదార కలిపి ఒంటికి రాసుకుని మర్దన చేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఒత్తిడి దూరమవుతుంది.
* అలసటగా ఉందని చాలామంది వేడివేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా జుట్టురాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే స్నానానికి ఎప్పుడూ గోరువెచ్చటి నీటిని వాడాలి. ఇందులో రెండు చుక్కల లావెండర్ నూనెను కలిపి తలస్నానం చేయాలి. అప్పుడు లావెండర్ నూనెలోని చక్కటి సువాసనలు మెదడును తేలికపరుస్తాయి. మనసుకు హాయి కలుగుతుంది.
* బాదం నూనె, యూకలిప్టస్ నూనెలను సమానంగా కలిపి కాస్త వేడి చేయాలి. దీన్ని తలకు రాసి మర్దనా చేయాలి. కాసేపు అయిన తరువాత ఆవిరి పట్టాలి. ఇలా ఓ గంటసేపు ఉండి ఆనక గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఫలితంగా తలనొప్పి వంటి రుగ్మతలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఆపై అర బకెట్ గోరువెచ్చటి నీళ్లలో రాళ్ల ఉప్పు, రెండు చుక్కల యూకలిప్టస్ నూనె, కప్పు గులాబీ నీళ్లను కలపాలి. అందులో అరగంట పాటు కాళ్లను ఉంచితే ఒత్తిడి వల్ల ఎదురయ్యే ఒళ్లునొప్పులు దూరమవుతాయి.