ఐడియా

కొనగోటి అందం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేజీకి వెళ్లే అమ్మాయిలు గోళ్ల అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. గోర్ల రంగును ఉపయోగించడంలో మెలకువలు తెలుసుకోగలిగితే మరింత చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు.
* కొందరు గోళ్ల రంగు వేసుకుంటే అది చర్మంపై కూడా అంటుకుంటుంది. అలాంటప్పుడు వాడేసిన లిప్ బ్రష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి చర్మంపై పడిన రంగును అద్దితే అది పోతుంది.
* గోళ్ల రంగు ఎక్కువ కాలం ఉండాలంటే.. నెయిల్‌పాలిష్ వేశాక పైన పారదర్శకంగా కనిపించే బేస్‌కోట్‌ని వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది.
* పార్టీలకు వెళ్లేముందు గోళ్ల రంగు వేసుకుంటారు కొంతమంది. అలాంటప్పుడు త్వరగా ఆరాలంటే చేతివేళ్లను రెండు నిముషాలు చేతుల్ని ఐస్ వాటర్‌లో ఉంచితే సరి.
* గోళ్లరంగు సీసాలను ఎలా పడితే అలా ఊపకూడదు. రెండు చేతుల మధ్యలో ఉంచుకుని గుండ్రంగా తిప్పితే చాలు. అప్పుడే ఆ సీసాలో బుడగలు రాకుండా ఉంటాయి. గాలి లోపలికి చేరదు.
* గ్లిట్టర్ నెయిల్ పాలిష్ ఎంచుకున్నప్పుడు అది త్వరగా వదలదు. అప్పుడు రిమూవర్‌లో ముంచిన దూదిని ఉండలుగా చేసి గోళ్లపై ఉంచాలి. కొన్ని నిముషాల తరువాత గట్టిగా అదిమి తుడవాలి. ఇలా చేయడం వల్ల రంగు త్వరగా తొలగిపోతుంది.