ఐడియా

జుట్టు పట్టుకుచ్చులా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి కాలుష్య ప్రపంచంలో చాలామందికి చిన్న వయసులోనే జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. జీవనశైలిలో మార్పులు, పోషకాహారంలోపం.. ఇలా కారణం ఏదైనా ఆ సమస్యను దూరం చేసుకోవాలంటే ఇంట్లోని ఈ నియమాలు పాటిస్తే మంచిది.
* కొందరు తలకు నూనె అస్సలు పెట్టరు. దానివల్ల జుట్టు ఎండుగడ్డిలా మారి రాలిపోవచ్చు. అందుకే తలస్నానం చేయడానికి కనీసం గంట, గంటన్నర ముందు తప్పనిసరిగా గోరువెచ్చని నూనె రాసి మర్దన చేయాలి. ఇందుకోసం నువ్వులనూనె, ఆలివ్‌నూనెలను సమపాళ్లలో తీసుకుని వేడి చేయాలి. ఈ మర్దన వల్ల మాడులో రక్తప్రసరణ సక్రమంగా జరిగి కుదుళ్లు దృఢంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
* కాలం ఏదైనా జుట్టు నిర్జీవంగా కనిపిస్తే.. గుప్పెడు మందారపూలను మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి పావుకప్పు పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో రుద్దుకుంటే చాలు.
* గ్రీన్ టీ చల్లారాక ఆ నీటిని తలపై పోసుకోవాలి. జుట్టు మొత్తం తడిసేలా చూసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. గ్రీన్ టీలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తాయి.
* రాత్రిపూట పెరుగులో ఐదు చెంచాల మెంతుల్ని నానబెట్టుకోవాలి. రెండూ కలిపి ఉదయానే్న మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చెయ్యాలి. అప్పుడు జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది.