ఐడియా

మీరు ఒంటరివాళ్లు కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక కుంగుబాటు వల్ల జీవితం నరకప్రాయం అవుతుందని, తగిన అవగాహన కలిగిస్తే ఈ సమస్యను అధిగమించడం అసాధ్యమేమీ కాదని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అంటోంది. కుంగుబాటు సమస్యపై దేశవ్యాప్తంగా చైతన్యం కలిగించేందుకు ఆమె తాజాగా ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. ‘మీరు ఒంటరివాళ్లు కాదు’.. అనే నినాదంతో తాను చేపట్టిన ప్రచారోద్యమం మంచి ఫలితాలను ఇస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తోంది. కుంగుబాటుకు లోనైనవారు వౌనంగా ఉండిపోతే పరిస్థితి మరింతగా విషమిస్తుందని, తగిన అవగాహన పెంచుకుంటే నిరాశను అవలీలగా జయించవచ్చని ఆమె వివరిస్తోంది. తొలి విడతగా పాఠశాలల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తగిన అవగాహన కల్పిస్తే పాఠశాల స్థాయి నుంచి ఈ సమస్యను నివారించవచ్చని అంటోంది. బెంగళూరులోని సోఫియా హైస్కూల్‌లో తన ప్రచార కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సుమారు 200 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు దీపిక ప్రకటించింది. మానసిక సమస్యల నుంచి యువతను దూరంగా ఉంచాలంటే ముందుగా పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాల్సి ఉంటుందని చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, మానసిక వైద్యనిపుణుల సహాయంతో విద్యార్థులకు కౌనె్సలింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే దేన్నయినా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం నేటి యువతలో పెరగాల్సి ఉందని దీపిక అంటోంది. ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారు నిర్భయంగా తమ సమస్యలను చెప్పుకోవాలని, ఈ విషయమై విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అండగా నిలవాలని ఆమె కోరుతోంది.