ఐడియా

బరువును తగ్గించే బ్రకోలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. నేటి ఆధునిక, యాంత్రిక జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆహార విషయంలో శ్రద్ధ తక్కువైంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో అనారోగ్యం, ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ముఖ్యమైనది బ్రకోలి. ఆకుపచ్చని కూరగాయల్లో దీనికి ప్రత్యేకతమైన స్థానం ఉంది. కారణం దీనిలో పోషకాలు మెండుగా ఉండటమే..
* ఉడికించిన బ్రకోలీని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. కొన్ని కూరగాయలను ఉడికించి తినాలనుకున్నా వాటి వాసన వల్ల తినలేము. కానీ బ్రకోలీని ఉడికించుకుని ఆనందంగా తినవచ్చు. వాసన రాదు. పైగా తక్కువ కేలరీలుండే ఈ గ్రీన్ వెజిటబుల్‌ను తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. బ్రకోలీని తీసుకున్న చాలాసేపటి వరకు కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి త్వరగా వేయదు. ఎక్కువ ఆహారాన్ని తినలేరు.
* గర్భిణీలు బ్రకోలీని తీసుకుంటే.. ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్లు పిండం పెరుగుదలకు సహకరిస్తాయి.
* బ్రకోలీలో విటమిన్ సి, ఇలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని అధికంగా తినడం వల్ల మెదడులోని కణజాలం దెబ్బతినకుండా ఉంటుంది.
* క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతికి చెందిన క్యాబేజీ, బ్రకోటీ వంటి కూరగాయలు మూత్రాశయ కేన్సర్లను సమర్థంగా ఎదుర్కొంటాయి. బ్రకోలీలో లభించే విటమిన్ - ఇలో ఉండే ఆల్ఫాటోకోఫెరాల్ అనే రసాయనం బ్లాడర్ కేన్సర్‌ను నివారిస్తుంది.
* బ్రకోలీ మొలకలు బ్రెస్ట్ కేన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో సల్ఫోరఫేన్ అనే ఎంజైమ్ కేన్సర్ కణాలతో పోరాడుతుంది.
* బ్రకోలీలో విటమిన్- ఇ, సిలు అధికంగా ఉంటాయి. కాబట్టి బ్రకోలీని ఎక్కువగా తినడం వల్ల చర్మ నిగారింపు కూడా మెరుగవుతుంది.
ఇన్ని మంచి గుణాలు ఈ కూరగాయలో ఉండటం వల్ల బ్రకోలీని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. అయితే దీన్ని ఎక్కువగా ఉదయం, మధ్యాహ్న వేళల్లోనే ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఆహారాన్ని రాత్రిపూట తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కష్టం అవుతుంది.