ఐడియా

తడి వాసన వదలాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాకాలంలో బట్టలు తొందరగా ఆరవు. ఎక్కువ రోజులు ఆరబెట్టడం వల్ల కూడా బట్టలు అదో రకమైన మగ్గు వాసన వస్తూంటాయి. వర్షాకాలంలో తడి వల్ల ఒక్కోసారి ఇల్లంతా దుర్వాసన వస్తూంటుంది. ఇలాంటి సమయంలో..

* దుర్వాసనకు మూలమైన ఫంగస్, సూక్ష్మజీవులను నిమ్మరసంలోని ఎసిటిక్ ఆమ్లం నిర్మూలిస్తుంది. అందుకని అరబకెట్ నీళ్లలో ఒక నిమ్మచెక్కను పిండి అందులో ఉతికిన బట్టలను ఒక నిముషం ఉంచి పిండి ఆరేయడం వల్ల బట్టలు దుర్వాసన రాకుండా ఉంటాయి. అలాగే బకెట్ నీళ్లలో నిమ్మరసం పిండి ఇల్లు తుడవడం వల్ల కూడా సూక్ష్మజీవులు, ఫంగస్ నశించి ఇల్లు శుభ్రంగా ఉంటుంది.

* వెనిగర్‌కు కూడా ఫంగస్‌ను నిర్మూలించే శక్తి ఉంది. అందుకని నీళ్లలో దీన్ని కలిపి ఇల్లు తుడిచినా దుర్వాసన పోతుంది.

* పసుపు ఫంగస్‌ను నిర్మూలిస్తుంది. వర్షాకాలంలో బయటి నుంచి వచ్చే సూక్ష్మజీవుల్ని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది. అందుకని అప్పుడప్పుడూ పసుపు కలిపిన నీళ్లతో ఇల్లును తుడవాలి. ఇలా చేయడం వల్ల నేలపై ఉన్న సూక్ష్మజీవులు నశిస్తాయి.

* దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో వంటసోడా చల్లి చూడండి. వంట సోడా దుర్వాసనల్ని పీల్చుకుంటుంది.

* ఉప్పు కూడా ఫంగస్‌ను నిర్మూలిస్తుంది, తడిని పీల్చుకుంటుంది. ఉప్పుని చిన్న బట్టలో కట్టి తడి ప్రదేశంలో ఉంచితే సరి.