ఐడియా

బరువు తగ్గట్లేదా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది బాగా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యవంతమైన భోజనం చేస్తుంటారు. చక్కగా నిద్రపోతారు. కానీ బరువు మాత్రం తగ్గట్లేదని బాధపడుతూ ఉంటారు. కారణం వారికే అర్థం కాదు. డాక్టర్లకు కూడా కొన్నిసార్లు ఈ విషయం అర్థం కాదు. అయితే బరువు తగ్గడం కేవలం తిండి, నిద్రపైన ఆధారపడి ఉండదనీ, దానికి అనేక ఇతర అంశాలూ కారణం కావచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అందులో భాగంగా బరువును నియంత్రించే ఈ ఐదు కారణాలను శాస్తవ్రేత్తలు ప్రస్తావించారు.
* పేగుల్లో ఉండే అనేక రకాల సూక్ష్మజీవులు మన జీర్ణక్రియను నియంత్రిస్తాయి. ఎన్ని భిన్నమైన సూక్ష్మజీవులు కడుపులో ఉంటే, అంత సన్నగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సూక్ష్మజీవుల వృద్ధికి తోడ్పడే పీచుపదార్థాలు సమృద్ధిగా ఉండే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
* వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటున్నా బరువు తగ్గట్లేదంటే జన్యుపరమైన కారణాలు కూడా దానికి కారణం కావచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధన చెబుతోంది. బరువు, జీర్ణశక్తితో పాటు శరీరంలో కేలరీలు కరిగే విధానంపై దాదాపు వందరకాల జన్యువుల ప్రభావం ఉంటుంది. జన్యుపరమైన సమస్యలు ఉంటే ఆకలి పెరిగి ఆహారం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది.
* ఎంత ఆలస్యంగా భోజనం చేస్తే అంత బరువు పెరగడానికి అవకాశం ఎక్కువ. సాధారణంగా రాత్రుళ్లు జీర్ణక్రియ వేగం మందగిస్తుంది. అన్ని రకాల పదార్థాలూ అంత త్వరగా అరగవు. అందుకే సాయంత్రం ఏడు గంటల లోపు భోజనం ముగించుకుంటే బరువు నియంత్రణలో ఉండే అవకాశం ఎక్కువ.
* తాము ఎంత తింటున్నామనే విషయాన్ని చాలామంది సరిగ్గా అంచనా వేయలేరు. మనం తక్కువగా తింటున్నామనే భావనతో ఉంటే, మెదడు కూడా అదే నిజమనుకుంటుంది. ఎందుకంటే మెదడు మనం ఏం చెబితే అది వింటుంది. అందుకే చాలామంది ఆహారంపై సరైన అవగాహన లేకుండా ఎక్కువ తినేస్తుంటారు. అందుకే జంక్ ఫుడ్‌ను తగ్గించి తక్కువ మొత్తంలో తినడాన్ని సాధన చేస్తే క్రమంగా మెదడు కూడా దానికి అలవాటు పడుతుంది.
* శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోనులే మన ఆకలిని నియంత్రిస్తాయి.
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన కొంతమంది శాస్తవ్రేత్తలు, కడుపులోని కొన్ని సూక్ష్మజీవుల్ని ల్యాబ్‌లో కృత్రిమంగా సృష్టించారు. అవి శరీరంలోని ఆకలిని నియంత్రిస్తాయట. సాధారణంగా ఒబెసిటీ సర్జరీ పూర్తయ్యాక ఆకలిని ప్రేరేపించే హార్మోన్లను నియంత్రిస్తారు. ఆ పనిచేయడానికి ఈ సూక్ష్మజీవులే సాయపడతాయి. కృత్రిమంగా సృష్టించిన ఈ సూక్ష్మజీవుల వల్ల ఎలాంటి హానీలేదని తేలితే వీటిని ఒబెసిటీ చికిత్సలో భాగం చేయాలని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
ఇలా బరువు తగ్గడానికి ఇవి కారణాలు కావచ్చు. కాబట్టి నెమ్మదిగా మన శరీర నియమాలను అర్థం చేసుకుని మెదడు ద్వారా శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటే నెమ్మదిగా బరువు తగ్గవచ్చు.