ఐడియా
జుట్టు చిట్లుతోందా!?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వ్యాయామం చేసేటపుడు చికాకుగా అనిపించి జుట్టును గట్టి ముడివేస్తుంటాం కదా. కానీ ఇలా గట్టిముడి వేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతాయి. పైగా చెమట పట్టడం వల్ల జుట్టు ఊడిపోవడం లేదా ఎండుగడ్డిలాగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాకాకుండా ఉండాలంటే జుట్టుకు వ్యాయామానికి ముందు కండీషనర్ రాయాలి. ఆ తరువాత ముడి కూడా జారుగా ఉండే ముడే వేసుకోవాలి. ఇలా జుట్టు కుదురుగా ఉండదనిపిస్తే రబ్బరు బ్యాండు లేక క్లిపు పెట్టుకుంటే మంచిది. అంతేకాక వ్యాయామాలు ఎండలో చేయకుండా నీడలో చేస్తే మరీ మంచిది.
మొలకలు ఇలా...
మొలకలకు తీసుకున్న గింజల్లో శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి.
మొలకలు రోజు ఇంట్లో తయారు చేసుకోవాలి. వాటిని తీసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.
మొలకలు వచ్చిన శనగలు తినడానికి ఎంతో బాగుంటాయి. అలా తినలేని వారు పచ్చి కూరలతో కలుపుకుని తినవచ్చు.
వేయించుకుని తిన్నా మంచి ప్రయోజనమే కలుగుతుంది.
మొలకలు వచ్చిన తరువాత కూడా ఒకసారి కడిగి తర్వాత తింటే మంచిది.
అందుకే ప్రతిరోజు మరుసటి రోజు కోసం మొలకలకు నానబెట్టుకుంటేనే మంచిది.