ఐడియా

ఎసిడిటీ తగ్గడానికి చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో చాలామందిలో ఎసిడిటి కనిపిస్తుంది. ఆహారం తిన్నవెంటనే కడుపులో, ఛాతీలో మంట అంటుంటారు. అసలీ మంట ఎందుకు వస్తుందంటే ఆహారం జీర్ణం కావడానికి విడుదలయ్యే ఆమ్లాలు, రసాలూ జీర్ణాశయంలో అవసరానికి మించి విడుదల అవుతుంటాయి. దీనితో తిన్న ఆహారం ఆ అమ్లాలు కలసి పైకి ఎగతన్ని గుండెలో మంట వేధిస్తుంది. ఇంకొందరికి నోట్లో పుల్లని నీళ్లు వస్తుంటాయి. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని కడుపులో నొప్పి ఎక్కువగా బాధిస్తుంటుంది. అట్లాంటపుడు అనుకొన్న పనులేవీ చేయలేక సతమత మవుతుంటారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, లేక వివిధ రకాలైన జబ్బులకోసం మందులు వాడుతున్నా, మద్యపానం, చేసేవారిలో కూడా ఈ సమస్య తలెత్తుతుంటుంది. అంతేకాదు సరియైన ఆహారపుటలవాట్లు లేకపోతే కూడా ఈ ఎసిడిటి సమస్య బాధిస్తుంది. శారీరిక శ్రమ ఉంటే ఎసిడిటీని యంత్రించుకోవచ్చు. దీన్ని అధిగమించాలంటే కొద్ది పాటివ్యాయామం వేళ ప్రకారం శ్రుతి మించని ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతుంటే లేత కొబ్బరి నీళ్లను సేవించాలి. లేత కొబ్బరిని నెమ్మదిగా నమిలి తినడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది. జీలకర్ర వేయించి పొడి చేసుకొని ఈ పొడిని గ్లాసు మరుగుతున్న నీటిలో వేసి బాగా మరిగించి చిన్న బెల్లం ముక్కను చేర్చి గోరువెచ్చగా చల్లార్చి ఈ నీటిని తీసుకొంటే ఎసిడిటి సమస్య దూరమవుతుంది. సోయాబీన్స్, చిక్కుడు జాతి కూరలు, ఎండు ద్రాక్ష, యాపిల్, తేనె , పలుచటి మజ్జిగ, పుదీనా వంటి పదార్థాలు ఎక్కువగా ఆహారంలో ఉండేటట్లు చూసుకొంటే ఎసిడిటి తగ్గుతుంది. అతి కారం, అతి పులుపు తినకూడదు. మసాలాలకు దూరం కావాలి. నూనెల్లో వేయించిన చిప్స్ జోలికి పోకూడదు. ఇవి అన్నీ పాటిస్తే ఎసిడిటి తగ్గుతుంది. ఎసిడిటి తగ్గడానికి టీవీల్లో చూపించే మందులకన్నా కొద్ది గా కష్టమైనా ఆహారపుటలవాట్లు మార్చుకుంటే ఎసిడిటి సమస్యనుంచి దూరం కావచ్చు.

- సి. వెంకటలక్ష్మి