ఐడియా
అధరం సుందరం...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎదుటివారిని ఆకర్షించేది మనిషి ముఖమే అయినా అందులోకూడా పెదాలు మొట్ట మొదట కనిపిస్తాయి.మాట వల్లే స్నేహం ఏర్పడుతుంది. మాటను వెలువరించేది నోరే కనుక ఆ నోటికి తలుపుల్లాంటివి పెదవులు. వీటిని కొందరు అతిగా పట్టించుకుంటే మరికొందరు నిర్లక్షం చేస్తుంటారు.
ఇందులో ఏది చేసినా ముప్పేర్పడుతుంది.
ఆ ముప్పు తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
పెదవుల అందంకోసం పైపై మెరుగులు దిద్దుకోవడం కన్నా వాటిఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తే పెదవులు లిప్‌స్టిక్ వేయకపోయనా దొండపండురంగులో మెరుస్తుంటాయ. రోజుకు 5 లేక 6 లీటర్ల మంచినీరు తీసుకొంటే పెదవులు ఎండిపోకుండా ఎప్పుడూ తళుకులీనుతుంటాయి.
కొంతమంది పదేపదే లిప్‌స్టిక్ ను వాడుతుంటారు. డార్క్ రంగులను, లేక చాలాలేత రంగులను వాడుతుంటారు. ఇవి రెండూ కూడా ముఖానికి ఎబెట్టుగా కనిపిస్తాయి. అందుకే ముఖ చర్మాన్ని బట్టి పెదవులకు లిప్‌స్టిక్ రంగులు ఎంచుకోవాలి.కొన్ని సార్లు వేసుకొన్న బట్టలరంగుకూడా పెదవులపై ప్రభావం చూపుతుంది. అందుకని బాగా ఆలోచించి లిప్‌స్టిక్ రంగును ఎంచుకోవాలి. ఒక్కోసారి రుద్దుకోవడంలో ఎక్కువ రంగు వేసేసుకున్నట్టు అనిపిస్తుంది. అట్లాంటపుడు బ్లాటింగ్ పేపర్‌ను పెదవులపై అద్దితే చాలు. ఎక్కువ రంగు ఉంటే పోతుంది.
శరీరంపై మృతకణాలున్నట్లే పెదవులపైనా కూడా ఉంటాయి. కనుక బ్రష్ చేసుకొనేటపుడే పెదవులపైన కూడా కొద్దిసేపు బ్రష్‌తో తోమితే చాలు ఆ మృతకణాలు పోతాయి.
కొంతమందికి పెదవులు నాలుకతో తడపడం అలవాటు ఉంటుంది. ఇది అంత మంచి పనే కాదు. నోరును ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అపుడే పెదవులు కూడా అందంగాను ఆరోగ్యంగాను ఉంటాయి.
- మరీ ఎండిపోయనట్టు అనిపిస్తే పెట్రోలియం జెల్లీ రాయండి. లేకపోతే లిప్‌బామ్ ఉపయోగించండి. పెదవులు అందంగా కనిపిస్తాయ.