ఐడియా
జుట్టు సమస్య..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొందరిలో జుట్టు చిన్నప్పుడే తెల్లబడి పోతుంటుంది. ఇంకొందరి మరీ చిన్నపిల్లల్లో కూడా తెల్లబడి ఉంటుంది. ఇటువంటివాళ్లు ఉసరిపొడిని దానికి తగ్గ నిమ్మరసాన్ని కలిపి మాడుకు పట్టించి తరువాత తలకు పోసుకొంటే ఈ తెల్లబడే తత్వం నుంచి బయటపడవచ్చు. ఉసిరి రసాన్ని అంతే మోతాదులో కొబ్బరి నూనెను కలిపి బాగా మరగ కాచి ప్రతిరోజు ఆ నూనెను జుట్టుకు రాయడంవల్ల కూడా త్వరగా తెల్లబడదు. పైగా జుట్టు వత్తుగా పెరుగుతుంది. మందార ఆకులను కుంకుడు కాయతో కలిపి తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలడం, తెల్లబడడం అనే సమస్యలనుంచి దూరం గావచ్చు. నువ్వులను మెత్తగా నూరి అందులో బాదం ఆయిల్ నుకలిపి ప్రతిరోజు జుట్టు కు పట్టించడం వల్ల కూడా జుట్టు నల్లబడే అవకాశాలున్నాయి. ఉల్లిపాయ రసాన్ని బాగా జుట్టు కుదుళ్లకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచేసి తిరిగి తెల్లవారి తలంటు పోసుకొంటేజుట్టు అనుకోనంతగా పెరుగుతుంది. కాకపోతే కాస్త ఉల్లి వాసన వస్తుంటుంది. ప్రతి వారం జుట్టును నూనె పూసుకొని మర్దనా చేసి, తరువాత తలస్నానం గోరువెచ్చని నీటితో చేస్తే జుట్టు పట్టులాగా బాగుంటుంది.