ఐడియా

కరివేపాకు.. లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచేవేరు. కరివేపాకును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మంచి వాసన మంచి రుచిని ఇచ్చే కరివేపాకు కేవలం అవేకాక మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వైద్యంలోను కరివేపాకు పాత్ర అమోఘం అంటారు ఆయుర్వేద నిపుణులు. అందుకే కరివేపాకు గురించి కాస్త తెలుసుకుందాం.
ప్రతి రోజు ఉదయానే్న పరగడుపున పది కరివేపాకు ఆకులను తింటే రక్తహీనత సమస్య దూరం అవుతుంది. రక్తం బాగా పెరుగుతుంది. హీమోగ్లోబిన్ స్థాయిలు వృద్ధి అవుతాయి. రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది.
నిత్యం ఉదయానే్న కరివేపాకు ఆకులను తింటే మధుమేహం(షుగర్) కొద్ది రోజుల్లో పూర్తిగా అదుపులోకి వస్తుంది. టైప్ 1,2 ఎలాంటి డయాబెటిస్ అయిన తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
కొలస్ట్రాల్ తగ్గిస్తుంది. వూబకాయం తగ్గించడంలోను కరివేపాకుదే అందె వేసిన చేయ. రెండు రెమ్మల ఆకులను లేక పది కరివేపాకులను పరగడుపున సేవిస్తే కేవలం ఒక్క నెలరోజుల్లోనే వూబకాయం మాయమవుతుంది. బానపొట్టలు కరిగిపోతాయ.
నిత్యం కరివేపాకులను తింటుంటే లివర్ శుభ్రం అవుతుంది. లివర్‌లో ఉండే విషపదార్థాలు బయటకి వెళ్లిపోతాయి.
కరివేపాకును తినడం వల్ల జీర్ణసమస్యలు పోతాయి. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటి, మలబద్ధకం ఉండవు. డయేరియా సమస్య తొలగిపోతుంది. నీళ్ళ విరేచనాలు ఆగుతాయి. వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి. నల్లగా మారుతాయి. చుండ్రు పోతుంది. నేత్ర సమస్యలకు ఇది చక్కటి ఔషదం. శరీరరోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని మంచిలక్షణాలున్న కరివేపాకును మన దైనందిన జీవితంలోకి ఆహ్వానిద్దామా మరి.