ఐడియా
జ్వరాన్ని తగ్గించుకోండిలా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాతావరణం మారుతోంది. క్రమంగా మండే ఎండలు పోయి చల్లబడుతోంది. మేఘావృతమై చల్లని గాలులు, అడపా దడపా వర్షాలు పలుకరిస్తున్నాయి. నిన్నటి దాకా వేసవి సెలవుల్లో గడిపిన విద్యార్థులు మెల్లగా స్కూలు మెట్లు ఎక్కుతున్నారు. వారి చదువుల బాట పట్టడం ఇటు వర్షాకాలం ఆరంభమవడం మొదలై పోయింది. అప్పుడప్పుడు పడే వర్షాలు నిను వీడని నీడను నేను అంటూ ఉన్న ఎండలు రెండూ కలసి పిల్లలకే కాదు పెద్దలకు కూడా అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
సాధారణంగా ఈ కాలంలో జలుబు చేస్తుంటుంది. ఇక ఏముంది. జలుబు అంటే పది రోగాలు దరిచేరినట్టే . ఒళ్లు నొప్పులు, ముక్కు దిబ్బడ, జ్వరం, వాంతులు, దగ్గు ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటిగా చేరినా అన్నీ కలసి బాధిస్తాయి. మంచం ఎక్కేట్టుగా చేస్తాయి.
అందుకే పడశం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. నీటి కాలుష్యం తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముందు నీటి గురించి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం మేలు. కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకోవడమూ మేలు. ఇక తినేపదార్థాలు కూడా వండిన రెండు మూడు గంటల లోపే తీసుకోవడం మంచిది. పైగా వండేటపుడు మూతల విషయంలో జాగ్రత్తతీసుకోవాలి. వండిన పదార్థాల మీద మూతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిత్తడిగా ఉన్న ప్రదేశాల్లోనో, లేక తడిగా ఉండే వంటిల్లు లాంటివి వాటి వల్ల, మురుగు నీరు పోయే సింకుల్లో చిన్న గుంటల్లో బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు తిరుగాడుతుంటాయి. అవి ఈ తినే పదార్థాల మీద పాకితే లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే మూతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వంటిల్లును పొడిగా ఉంచేలా చూడాలి. పొడులు, పచ్చళ్ల విషయంలోకూడా జాగ్రత్తలు పాటించాలి. పచ్చళ్లపైన బూజు పట్టడమో, రుచి, రంగు మారడమో ఉంటే వెంటనే వాటిని దూరం చేయడమే మంచిది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాటిని వాడరాదు.
పండ్ల విషయంలో అంతే నిన్న తెచ్చినవే కదా కొద్దిగా చెడిపోయినట్టు అనిపిస్తే అంతవరకు తీసేసి కొంతమంది ఉపయోగిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచి విషయం కాదు. వీటి వల్ల అనారోగ్యం దరిచేరుతుంది. వాటిని పారయేడమే మంచిది. ఒకవేళ జ్వరం గనుక వస్తే వెంటనే డాక్టర్లు సంప్రదించాలి. అంతలోపు సగ్గుబియ్యం జావా, మంచినీరు జ్వరపీడితులకు ఇవ్వాలి. ధనియాలు కాస్త వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ఒక చంచా రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. అవి ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగించి వడపోసి వాటిని అప్పుడప్పుడు జ్వరం వచ్చిన వారికి ఇస్తుంటే ఒంట్లో వేడి తగ్గి జ్వరం నుంచి బయటపడవచ్చు. వేడి శరీరం ఉన్నవారు కూడా ఈ ధనియాల కషాయాన్ని తీసుకొంటే ఒంట్లో వేడిని దూరం చేసుకోవచ్చు. తులసి రసాన్ని కూడా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల జ్వరం నుంచి తప్పించుకోవచ్చు. చిన్న పిల్లలకైతే ముక్కుల్లో ఈ తులసి రసం వేస్తే వారు జలుబు, జ్వరం నుంచి కోలుకుంటారు.
జ్వరం వచ్చినప్పుడు అసలు ఆహారం తీసుకోకుండా ఉండకూడదు. తేలిక పాటి ఆహారాన్ని తీసుకోవాలి. దానికోసం అరగ్లాసు బియ్యాన్ని సన్నని సెగ మీద వేయించి పొడి చేసుకొని దానికి ఏడు గ్లాసుల నీటిని చేర్చి ఉడికించుకోవాలి. కాస్త ఉప్పు, వాము, కలిపితే మంచి రుచి వస్తుంది. ఈ జావను జ్వరపీడితులకు ఇవ్వాలి. ఈ జావను తాగితే మందగించిన జీర్ణశక్తి తిరిగి ఉత్తేజితం అవుతుంది. వాము వల్ల జలుబు, జ్వరం కూడా తగ్గుముఖం పడుతాయి.
జలుబు భారం ఎక్కువగా ఉంటే మరిగించిన నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే ముక్కు భారం తగ్గుతుంది. జలుబు వల్ల కలిగే తలనొప్పికూడా తగ్గుతుంది. మరీ తలనొప్పి ఎక్కువ ఉంటే గంధం లో కర్పూర పొడిని కొద్దిగా కలిపి నుదటిపైన రాస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
ఈ జాగ్రత్తలతో పాటుగా డాక్టర్లు చెప్పినట్టు మందులు తీసుకొంటూ ఉంటే జ్వరం దూరమవుతుంది.
*