ఐడియా

బరువు తగ్గించే చిట్కాలివిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక బరువు చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా దక్షిణాదివారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఆచితూచి తిన్నా సరే.. వారిలో నలభై సంవత్సరాల తర్వాత పొట్ట వచ్చి పడుతుంది. అదే ఉత్తరాదివారిలో అయితే ఈ సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు గోధుమ రొట్టెలను తింటారు. మసాలాలూ తక్కువే. అందుకే వారు బరువు తక్కువ పెరుగుతారు. మనం కూడా మన ఆహార పద్ధతుల్లో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు.
* ఆధునిక కాలంలో అధిక బరువుకు ఓట్స్ పరమ ఔషధంలా మారాయి. ఉదయం పూట పాలల్లో ఓట్స్ వేసుకుని తినడం వల్ల బరువు పెరగరు. అలాగే మిగతా ఆహారపదార్థాల్లో కూడా ఓట్స్ శాతాన్ని పెంచాలి.
* నిద్ర లేచిన గంటలోపలే అల్పాహారాన్ని తినాలి.
* చికెన్, మాంసాలను తక్కువగా, చేపలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది.
* వారానికి మూడుసార్లు తప్పనిసరిగా గుడ్డును తినాలి.
* క్రమం తప్పకుండా రోజుకు అరగంట వ్యాయామం వల్ల శరీరం తేలిగ్గా ఉండటమే కాకుండా జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.
* పచ్చికూరగాయలు.. అంటే క్యారెట్, కీరా, కాలీఫ్లవర్ వంటివి కొవ్వును తగ్గిస్తాయి. పచ్చిబఠాణీ, శనగలు, పెసలు వంటివాటిని ఉడికించుకుని తినాలి.
* గ్రీన్ టీ చక్కటి ఆరోగ్యాన్ని, నాజూకైన శరీరాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* బార్లీ కూడా కొవ్వును బాగా కరిగిస్తుంది. వారానికి రెండు రోజులు బార్లీ జావను కానీ, నీటిని కానీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోవడమే కాకుండా మూత్ర పిండాల పనితీరు బాగుంటుంది.
*