ఐడియా

ఇలా చేస్తే... మరకలు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంట చేస్తున్నపుడు, వడ్డన సమయంలో దుస్తులపై ఆహార పదార్థాలు పడడం సహజం. దుస్తులపై టీ పడినచోట పాలలో ముంచిన దూది లేదా స్పాంజితో తుడిస్తే మరకలు పోతాయి. ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో రుద్దితే దుస్తులపై నూనె మరకలు తొలగిపోతాయి. బాగా ఎండబెట్టిన నిమ్మకాయ ముక్కలను బట్టలపై రుద్దితే ఎలాంటి మరకలైనా అదృశ్యం అవుతాయి. దుస్తులపై తుప్పు మరకలున్న భాగాన్ని వెనిగర్‌లో ముంచితే ఫలితం కనిపిస్తుంది. ఇంకు మరకలు పోవాలంటే అన్నం ముద్ద పెట్టి రుద్దాలి. వంట సోడాలో కాసిన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని రుద్దితే బట్టలపై మరకలు తొలగిపోతాయి. నిమ్మరసంలో కాస్త ఉప్పు వేసి మరకలున్న చోట తుడిచి, ఆ తర్వాత డిటర్జెంటు సబ్బు తో ఉతికితే దుస్తులు తళతళ మెరుస్తాయి.