ఐడియా

దాల్చినచెక్కతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యశాస్త్రంలోను, చిట్కా వైద్యంలోను దాల్చిన చెక్క గొప్ప ఔషధం.సాధారణంగా మసాలా దినుసుగా వాడుతుంటాం. కాని దీనిని ఆరోగ్యానికి వాడుకుంటే ఎన్నో లాభాలున్నాయి. దాల్చిన చెక్కలో సిన్నమాల్దిహైడ్ అనే ఆహార రసాయన ద్రవ్యం ఉంది. ఇది పేగులలో వచ్చే కొన్నిరకాల క్యాన్సర్లను నివారించే గుణం ఉంది. కండరాలలో వాపును తగ్గించే గుణం కూడా ఉంది. కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు దీన్ని వాడితే మంచి గుణం కనిపిస్తుంది. సంగీత కచ్చేరీలు చేసేవారు ఈ చెక్కను బుగ్గన పెట్టుకుంటే గొంతు శ్రావ్యంగా ఉంటుంది. నోటి దుర్వాసన అరికడుతుంది. దాల్చిన చెక్కను మెత్తగా చేసి ఆ పొడిని తేనె తో కాని, వేడినీటితో కాని తీసుకొంటే వూబకాయం తగ్గుముఖం పడుతుంది. దాల్చినీ చెక్కను, పంచదారను పొడిచేసుకుని తింటే జీర్ణకోశ వ్యాధులు దూరమవుతాయి. దాల్చిన చెక్క పొడి చర్మ సౌందర్యానికి కూడా మంచిదే. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. కళ్లకు కాంతిని కూడా అందిస్తుంది. అందుకే మోతాదుమించకుండా దాల్చిన చెక్కను ఉపయోగించడం ఎంతో మంచిదంటారు వైద్యులు. దేనికైనా అతి పనికిరాదు కదా. అట్లానే దాల్చిన చెక్కను కూడా అతిగా వాడరాదు. *