హైదరాబాద్

లబ్ధ్దిదారులందరికీ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విడియా పథకాలలో భాగంగా అర్హులైన లబ్దిదారులందరికి రుణాలను అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ బ్యాంకర్లను ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్ల కన్సల్టేటీవ్ కమిటీ సమావేశం కలెక్టర్ అమోయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. వివిధ బ్యాంకర్ల ప్రతినిధులతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ హరీష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్ హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులందరికీ రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో 700 కోట్ల రూపాయల రుణాలను అందజేయాలని లక్ష్యం నిర్ధారించగా జనవరి నెలాఖరు వరకు 39,734 మంది రైతులకు 260 కోట్ల 64 లక్షల రూపాయల రుణాలను అందజేసినట్లు తెలిపారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో 57512 మంది రైతులకు రూ.486.46 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు, వౌలిక సదుపాయాలు, స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ రంగంలో రూ.839.38 కోట్లను రుణాలుగా అందించామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15386 స్వయం సహాయక మహిళా గ్రూపులకు రూ.306 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యానికి గాను ప్రిబవరి 24వ తేదీ వరకు 7652 గ్రూపులకు రూ.281.40 కోట్లను అందించామని వివరించారు. ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యి గతంలోనే మంజూరైన రుణాలను లబ్ధిదారులకు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని బ్యాంకర్లను అడిగారు. మార్చ్ చివరి వరకు పెండింగ్‌లో ఉన్న రుణాలు లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూరగాయల విక్రయాలను జరిపేందుకు అర్హులైన వారికి రుణాలను మంజూరు చేసేందుకు లబ్దిదారులను ఎంపిక చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, వివిధ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.