హైదరాబాద్

వృద్ధుని గుండెకు అరుదైన శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట: గుండె రక్తనాళాలు పూడ్చుకుపోయి ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుడికి సికిందరాబాద్ సన్‌షైన్ ఆసుపత్రి కార్డియాలజిస్టుల బృందం అరుదైన వైద్యప్రక్రియను నిర్వహించి రోగికి పునః జన్మ ప్రసాదించారు. సోమవారం ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కార్డియాలజిస్ట్ విభాగధిపతి డా.శ్రీ్ధర్ కస్తూరి, సీనియర్ కార్డియాలజీ డాక్టర్లు శైలేందర్ సింగ్, విజయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన కోటేశ్వర రావు(63) కొంత కాలంగా గుండె సమస్యతో బాధ పడుతున్నారు. సన్‌షైన్ సంప్రదించగా అతనికి తగు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనరి ఆర్జరీ రోగంతో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు. గుండెలోని రక్తనాళం 90శాతం కాల్షియంతో పూడుకు పోవడంతో రక్త సరఫరా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇలాంటి సమస్యకు రోటా బ్లెటో కానీ అల్ట్రా హైఫ్రెషర్స్ బెలూన్స్ పద్ధతిలో రక్తనాళంలో పూడుకు పోయిన క్యాల్షియాన్ని తొలగిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని సందర్భాలలో రక్త నాళాలు దెబ్బతినే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఇంట్రావాస్క్యులర్ అథోట్రెప్సీ విధానంలో క్యాథిటర్ నుంచి సోనిక్ ఫ్రెషర్ తరంగాలను పంపించి పూడుకుపోయిన క్యాల్షియంను సులువుగా తొలగించ వచ్చని, దీని ద్వారా రక్త నాళానికి గానీ, గుండె చుట్టూ, ప్రక్కన ఉన్న మృదువైన కణాలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు వివరించారు. ఈనెల 11న కోటేశ్వర రావుకు నూతన పద్ధతి ద్వారా ప్రొసీజర్ నిర్వహించమని తెలిపారు. అతడిని 13న డిస్చార్జ్ చేశామన్నారు. అనంతరం సన్‌షైన్ హాస్పిటల్ నూతన ప్రక్రియపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో భాగంగా మరో ముగ్గురు రోగులకు ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ శ్రీ్ధర్ కస్తూరి వెల్లడించారు.