హైదరాబాద్

స్వైన్‌ఫ్లూతో బాలింత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: స్వైన్‌ఫ్లూ వ్యాధి బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి సోమవారం మృతిచెందింది. కుటుంబ సభ్యులు మాత్రం సరైన వైద్యం అందించటంలో వైద్యులు వహించిన నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళకు దిగారు. సక్రమంగా వైద్యం అందించామని ఆసుపత్రి వర్గాలు చెప్పినా, వారు ఆందోళన విరమించలేదు. ఈ ఘటనపై విచారణ కోసం ముగ్గురు వైద్యులతో ఆసుపత్రి వర్గాలు కమిటీని నియమించి, నాలుగు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూపరింటెండెంట్ డా.శ్రావణ్‌కుమార్ ఆదేశించటంతో మృతురాలి కుటుంబీకులు ఆందోళన విరమించారు. కరీంనగర్‌కు చెందిన ఓ గర్భిణి చికిత్స నిమిత్తం ఈనెల 19న గాంధీ ఆసుపత్రికి వచ్చింది. అప్పటికే ఆమెకు స్వైన్‌ఫ్లూ వ్యాధి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, ఆమెకు కాస్త మెరుగైన వైద్యం అందించాలని, ఆమె కుటుంబ సభ్యులు గాంధీ వైద్యులను కోరినా, పట్టించుకోకుండా సాధారణ వార్డులోనే ఉంచి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులతో ఆందోళనతో ఆ తర్వాత ఐసొలెటెడ్ వార్డులోకి మార్చి, చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె 20న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతూ, సోమవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
సీరియస్‌గా ఉండటంతోనే మృతి
ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రావణ్ కుమార్
స్వైన్‌ఫ్లూ పాజిటీవ్ రిపోర్టులతో గాంధీకి వచ్చిన గర్భిణీ పరిస్థితి అప్పటికే సీరియస్ ఉండటం వల్లే తమ ప్రయత్నాలు విఫలమై ఆమె మృతి చెందిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఆసుపత్రికి 14 స్వైన్‌ఫ్లూ పాజిటీవ్ కేసులు వచ్చాయని, వారిలో 13 మందికి వ్యాధి నయమైందని తెలిపారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు చేశామని, అందుకే ప్రత్యేక వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి, వైద్యులు ఎంతో సమన్వయంతో డెలివరీ చేశారని తెలిపారు. అయినా, ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబం ఆరోపిస్తున్నందున ముగ్గురు డాక్టర్లతో విచారణ కమిటీని వెసినట్లు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు నాలుగు రోజులలో నివేదిక రానున్నట్లు తెలిపారు.