హైదరాబాద్

ఆకట్టుకున్న అంతర్జాతీయ ‘ఒడిసీ’ డ్యాన్స్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: సంస్కతి కళా నికేతన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ ఒడిసీ డ్యాన్స్’ ఫెస్టివల్ ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సెజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రొత్సహిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఒడీసీ డ్యాన్స్ ఫెస్టివల్‌ను రవీంద్ర భారతిలో నిర్వహించడ సంతోషదాయకమని అన్నారు.
ప్రముఖ నృత్య గురువు దీబాప్రసాద్ పేరిట నృత్య గురువులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ నృత్య గురువు సుదీప్తా పాండా నిర్వహణలో వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి విచ్చేసిన నృత్య కళాకారులు ప్రదర్శించిన ఒడిసీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, టీఆర్‌ఎస్ నాయకురాలు శాంతి దేవి, విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రఘు అరికపూడి, జీఎస్ రాజు పాల్గొన్నారు.

25న ‘సప్తగిరి’ వైభవం నృత్య రూపక ప్రదర్శన
కాచిగూడ, ఫిబ్రవరి 23: రాగ సప్తస్వరమ్ ఆధ్వర్యంలో ‘సప్తగిరి వైభవం’ పేరిట శ్రీవేంకటేశ్వర తత్వం నృత్య రూపక ప్రదర్శన ఈనెల 25వ తేది రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు వీఎస్ రాజ్యలక్ష్మీ తెలిపారు. ఆదివారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత్రి సుందరపల్లి శ్రీదేవి రచించిన ‘గిరి వైభవం’ పుస్తకంలోని సప్తగిరులను ఆధారంగా ‘సప్తగిరి’ వైభవం నృత్య రూపకాన్ని ప్రముఖ నృత్య గురువు కళారత్న సుజాత వింజమూరి ఎంతో అద్భుతంగా రూపొందించారని వివరించారు. తన శిష్య బృందంతో దాదాపు గంట 36 నిమిషాల పాటు ప్రదర్శన నిర్విరామంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహ రావు ప్రవచనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.టీ.సుబ్బరామి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ మహిళ కమీషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పాల్గొంటారని తెలిపారు.