హైదరాబాద్

స్టాండింగ్ ‘కమిటీ’లో వాడీవేడి చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని అమలు చేసేందుకు కౌన్సిల్ సభ్యులే మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇష్టారాజ్యంగా జరిమానాలు వడ్డించటంపై ప్రజాప్రతినిధులు ఈవీడీఎంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈవీడీఎంను రద్ద చేయాలని డిమాండ్ చేయటంతో, దాన్ని రక్షించేందుకు కొందరు పాలక మండలి పెద్దలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే కమిటీ నియామక జాప్యమని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం.. ప్రజలకు విధిస్తున్న జరిమానాలు గుదిబండగా మారాయి. ఎలాంటి ప్రామాణికం లేకుండా వందల్లో విలువ చేసే భవన నిర్మాణ సామాగ్రికి వేలల్లో, వేలల్లో విలువ చేసే దానికి లక్షల రూపాయల్లో జరిమానాలు విధించటం పట్ల ఈ నెల 8వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో జరిమానాల విధింపునకు సంబంధించి కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. కానీ నాటి నుంచి కమిటీ వేయటంలో వహిస్తున్న తాత్సారంపై గురువారం జరిగిన స్థారుూ సంఘం సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో కూడా ఓ సారి స్థారుూ సంఘంలో కమిటీ వేయాలంటూ మజ్లిస్ సభ్యులు ప్రస్తావించగా, మేయర్ దాటవేశారని తెలిసింది. ఈ స్థారుూ సంఘం సమావేశంలో కమిటీ వేయాలనే అంశంపై ఒక దశలో కిరికిరి జరిగినట్లు సమాచారం. కమిటీ వేద్దామని మేయర్ చెప్పినా, కౌన్సిల్ తీర్మానం చేసి రెండు వారాలు గడుస్తున్నా, తీర్మానాన్ని అమలు చేయటంలో, తీర్మానం చేసిన వారే తాత్సారం వహించటానికి అసలు కారణమేమిటీ? అంటూ మజ్లిస్ సభ్యులు ప్రస్తావించినట్లు సమాచారం.
ఎడాపెడా జరిమానాలు విధింపుపై 8న కౌన్సిల్‌లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత కొందరు ప్రజాప్రతినిధులు చెప్పిన జరిమానాలను తొలగించినట్లు, మరీ పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలకు లక్షల రూపాయల్లో వేసిన జరిమానాల సంగతేంటీ? అంటూ మజ్లిస్ తీవ్ర స్థాయిలో ప్రశ్నించినట్లు సమాచారం. మాజీ మేయర్, స్థారుూ సంఘం సభ్యులు మాజీద్ హుస్సేన్ గురువారం నాటి స్థారుూ సమావేశానికి రాకపోవటంతో, అతనితో చర్చించి కమిటీని ఖరారు చేద్దామని మేయర్ నచ్చజెప్పటంతో మజ్లిస్ సభ్యులు వెనక్కి తగ్గినట్లు సమాచారం.