హైదరాబాద్

మళ్లీ హరేరామ హరేకృష్ణకే రూ.5 భోజనం బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో అకలితో అలమటించే వారికి జీహెచ్‌ఎంసీ తనవంతు సేవగా రూ.5కే అందించే భోజన పథకాన్ని కొనసాగించేందుకు ఎలాంటి సంస్థలు ముందుకు రాకపోవటంతో ఆ బాధ్యతలు మళ్లీ హరేరామ హరేకృష్ణ సంస్థకే దక్కాయి. గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్థారుూ సంఘం సమావేశం తీర్మానించింది. స్థారుూ సంఘం సభ్యులు సంగీత ప్రశాంత్ గౌడ్, మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్, ఎండీ ముస్త్ఫా అలీ, ఎం.మమత, ఎక్కాల చైతన్య కన్నా, మహ్మద్ ఖలీల్ అహ్మద్, షేక్ హమీద్, తొంట అంజయ్య, సబీహాబేగం, సామల హేమతో పాటు జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాధిపతులు జియావుద్దిద్, శ్రీ్ధర్, దేవేందర్ రెడ్డి, అదనపు, జోనల్ కమిషనర్లు అశోక్ సామ్రాట్, వీ.కృష్ణ, పీ.ప్రావీణ్య, ఉపేందర్ రెడ్డి, రవికిరణ్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలోని నిరక్షరాస్యులను గుర్తించి, వారిని కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, నగరాన్ని సంపూర్ణ అక్షరాస్యత నగరంగా తీర్చిదిద్దనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ స్థారుూ సంఘం సమావేశంలో వెల్లడించారు.
స్థారుూ సంఘంలో చేసిన తీర్మానాలు
* చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో జంగమ్మెడ్ డివిజన్‌లో రాజన్మబావి నాలా వద్ద మిగిలిపోయిన డ్రెయిన్ బాక్స్ వెడల్పు పనులకు రూ.2.09 కోట్లతో చేపట్టేందుకు అధికారులు సమర్పించిన ప్రతిపాదనకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది.
* జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లోని ఔట్‌సోర్సింగ్ అధికారులు, వర్కర్లకు జీతాలు చెల్లించేందుకు పది ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించేందుకు స్థారుూ సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.