హైదరాబాద్

‘కవన కిరణాలు’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ సాహితీవేత్త శివ మంచాల నిర్వహణలో ‘కవన కిరణాలు’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇరవై ఒక్క కవులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కవన కిరణాలుగా వెలుగులోకి తీసుకురావాడం అభినందనీయమని అన్నారు. కవులు వాట్సప్ గ్రూప్‌గా ఏర్పాడి సాహిత్య సంస్థను ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కథలను పుస్తక రూపంలో తీసుకురావాడం సంతోషదాయకమని పేర్కొన్నారు. పుస్తకంలో రాసిన కథలు అలోచింపజేసే విధంగా ఉన్నాయని తెలిపారు. కవులందరూ తమ, తమ భావవ్యక్తీకణలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణులైన్నారని చెప్పారు. తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సినీ గేయ రచయిత మల్లిక్, సాహిత్య ప్రకాశ్, సంస్థ అధ్యక్షుడు శివ మంచాల పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు సూర్యనారాయణ శాస్ర్తీ
కాచిగూడ, ఫిబ్రవరి 19: ప్రముఖ సాహితీవేత్త మల్లాది సూర్యనారాయణ శాస్ర్తీ చిరస్మరణీయుడు పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. మల్లాది సూర్యనారాయణ శాస్ర్తీ జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొలకలూరి ఇనాక్ పాల్గొని మల్లాది సూర్యనారాయణ శాస్ర్తీ చిత్రపటానికి నివాళి అర్పించి ఆయన సాహిత్య సేవలను కొనియాడారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించగా వైఎస్‌ఆర్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్‌ఆర్ మూర్తి, గానసభ కమిటీ సభ్యురాలు శ్రీలతా శర్మ, బృందావనం సంస్థ అధ్యక్షుడు వై.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
‘శివార్పణమ్’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, ఫిబ్రవరి 19: ప్రముఖ సాహితీవేత్త పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శివార్పణమ్’ గ్రంథావిష్కరణ సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ చారిత్రక నవల చక్రవరి ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పురాణపండ ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను రచించి సమాజానికి అందించారని తెలిపారు. శివ లీలాలు గురించి అద్భుతంగా పుస్తకంలో వర్ణించారని పేర్కొన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో నోరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ, ఎంవీ రావు పాల్గొన్నారు.