హైదరాబాద్

నీటి సమస్య లేకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న వేసవి కాలంలో నగరవాసులకు ఎలాంటి సమస్య ఎదురుకాకుండా జలమండలి అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ ఆదేశించారు. జలమండలి అధికారులతో కలిసి డిప్యూటీ మేయర్ బుధవారం బోరబండ డివిజన్‌లోని సైట్-2లోని ఎన్‌ఆర్‌ఆర్‌పురంలో పర్యటించారు. పలు ప్రాంతాలో మంచినీటి సరఫరా సక్రమంగా జరగటం లేదని ఫిర్యాదులు అందటంతో ఈ పర్యటన నిర్వహించారు. సైట్-2లోని ఎన్‌ఆర్‌ఆర్ పురంలోని స్థానికులకు, బోరబండలోని అన్ని ప్రాంతాల్లో ఎలాంటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు. ఈ ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత ప్రాతిపదికన చెక్ పెట్టేందుకు వీలుగా రిజర్వాయర్‌ను నిర్మించాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.