హైదరాబాద్

ఒక ఎకరంలో 10వేల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలోని గచ్చిబౌలిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ క్యాంపస్ ఆవరణలో ఒక్కరోజే పదివేల మొక్కలను నాటారు. ఈసారి సీఎం బర్త్‌డేను మొక్కలు నాటి జరుపుకోవాలనే పిలుపు మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ గచ్చిబౌలీ బయోడైవర్శిటీ ఫ్లైఓవర్ కింద కూడా క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. నగరంలోని 150 వార్డుల్లో కలిపి సుమారు రెండున్నర లక్షల మొక్కలను నాటాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాయిబాబా, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
దర్గాలో డిప్యూటీ మేయర్ ప్రార్థనలు
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ సోమవారం నాంపల్లి యూసుఫెన్ దర్గాల్లో మంగల్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ జీతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాసాబ్‌ట్యాంక్‌లోని సయ్యద్ సాహెబ్ రెహ్మతుల్లా దర్గాలో మొక్కలను నాటారు. అనంతరం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై ఏర్పాటు చేసిన ఫొటోప్రదర్శనను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలిసి సందర్శించారు.