హైదరాబాద్

అందరికీ ఆరోగ్య సౌకర్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ప్రజల ఆరోగ్యంపై పెట్టే ప్రతి పైసా దేశ ఆర్థికాభివృద్ధికి పరోక్షంగా తోడ్పడుతుందని, ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి మరిన్ని నిధులు ఖర్చు చేయాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ కే.శ్రీనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం రాజ్‌భవన్ రోడ్‌లోని అడ్మిషనిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఆడిటోరియంలో మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ చంద్రవౌళి స్మారకార్థం ‘అందరికి ఆరోగ్య సౌకర్యం - వివిధ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు’ అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన ఆస్కీ చైర్మన్, మాజీ హోంశాఖ కార్యదర్శి కే.పద్మనాభయ్య మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్య సేవలు కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.