హైదరాబాద్

‘స్థారుూ’సమావేశంలో తీర్మానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరవాసులకు ముఖ్యమైన సేవలను అందించే జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పనులు, పౌరసేవల నిర్వహణతో పాటు పాలన వ్యవహారాల్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించే స్థారుూ సంఘం గురువారం మరోసారి సమావేశమైంది.
సంగీత ప్రశాంత్‌గౌడ్, సమీనాబేగం, మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ ముస్త్ఫా అలీ, మిస్‌బాఉద్దీన్, మహ్మద్ మాజీద్ హుస్సేన్, ఎక్కాల చైతన్య కన్నా, మహ్మద్ అఖిల్ అహ్మద్, షేక్ హమీద్, తొంట అంజయ్య, ఆర్. శిరీష, సబీహాబేగం, సామల హేమ, కమిషనర్ లోకేష్‌కుమార్, అదనపు కమిషనర్లు, విభాగాధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.
తీర్మానాలు
* సికిందరాబాద్‌లోని వెస్ట్‌మారెడ్‌పల్లి జంక్షన్ అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ స్థారుూ సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను 30 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది
* జీహెచ్‌ఎంసీ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విభాగంలో ఇద్దరు రిటైర్డు ఉద్యోగుల కాంట్రాక్ట్ సేవల కాలాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించేందుకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది.
* అదనపు కమిషనర్(రెవెన్యూ) విభాగంలో ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అధికారి సేవలను కూడా వచ్చే డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలన్న ప్రతిపాదనకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది.
జరిమానాలపై కమిటీ ఏమైనట్టు?
జీహెచ్‌ఎంసీలో ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగం నగర ప్రజలకు ఇష్టారాజ్యంగా వేలు, లక్షల్లో జరిమానాలు విధించటంపై ఈ నెల 8వ తేదీన జరిగిన కౌన్సిల్‌లో మజ్లీస్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫిషియో మెంబర్లు సైతం తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! టీఆర్‌ఎస్, మజ్లీస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్ల డిమాండ్ మేరకు జరిమానాల విధింపు, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని, ఇందుకు స్థారుూ సంఘం సమావేశంలో చర్చించనున్నట్లు కౌన్సిల్ నిర్ణయించింది. కానీ గురువారం నాటి స్థారుూ సంఘం సమావేశంలో కనీసం ఈ కమిటీ ప్రస్తావన రాకపోవట చేసిన తీర్మానాలను అమలు చేయటంలో పాలక మండలి వహిస్తున్న అలసత్వం, నిర్లక్ష్యానికి నిదర్శనం.