హైదరాబాద్

వచ్చే నెలలో టీఓఏ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పర్యవేక్షణలో తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ఎన్నికలు జరగనున్నాయి. టీఓఏ నుంచి వేరైన క్రీడా సంఘాలు ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ)ని ఏర్పాటు చేసుకున్నాయి. నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నాయి. ఇటీవల రెండు సంఘాలు ఏకతాటిపైకి వచ్చి నగరంలోని లాల్‌బహదూర్ స్టేడియం ఫతేమైదాన్ క్లబ్‌లో సమావేశం నిర్వహించి చేరువయ్యయ. టీఓఏ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. రెండు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఒలింపిక్ సంఘం ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇరు వర్గాల సంఘాల ప్రతినిధులు సమన్వయంతో భారత ఒలింపిక్ సంఘం ఈ ఎన్నికలను దిల్లీలో ఫిబ్రవరి 9న నిర్వహించాలని ఖరారు చేసింది. ఎన్నికలను హైదరాబాద్ నగరంలోనే నిర్వహించాలని ఇటీవల ఓ క్రీడా సంఘం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల నిర్వహణ అధికారి హైకోర్టు రిటైర్డు జస్టిస్ చంద్రకుమార్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి బీ.అనంత శర్మఎన్నికల ప్రకియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఈనెల 24 నుంచి 26 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈనెల 30న నామినేషన్ల తిరస్కరణ ఉంటుందని ప్రకటించారు.
అధ్యక్ష పదవి కోసం మూడు, కార్యదర్శి కోసం ఇద్దరు, కోశాధికారి కోసం నాలుగు, ఉపాధ్యక్షుని కోసం నాలుగు నామినేషన్లు దాఖాలయ్యాయి. అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేసిన వారిలో ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ విభాగం చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ అథ్లెటిక్ సంఘం కార్యదర్శి రంగారావు ఉన్నారు. కార్యదర్శి పదవి కోసం తెలంగాణ కబడ్డి సంఘం కార్యదర్శి కే.జగదీశ్వర్ యాదవ్, తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు ఉన్నారు.
అదే విధంగా ఉపాధ్యాక్ష పదివీ కోసం ఎస్‌ఆర్.ప్రేమ్ రాజ్, పీ.ప్రకాష్ రాజ్, సంయుక్త కార్యదర్శి కోసం తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు పీ.మాల్లారెడ్డి, జూడో సంఘం కార్యదర్శి కైలాష్ యాదవ్ ఉన్నారు.