హైదరాబాద్

డబీర్‌పురాలో పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీలోని డబీర్‌పురా మున్సిపల్ వార్డు ఎన్నికలో భాగంగా బుధవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిన పోలింగ్ ప్రక్రియలో 27.31 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి కే.అనిల్‌కుమార్ తెలిపారు. ఈ డివిజన్‌లో మొత్తం 55వేల 155 మంది ఓటర్లుండగా, వారిలో 27.31 శాతం అంటే 13వేల 699 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. మొత్తం మహిళా ఓటర్ల శాతంలో 23.85 శాతం అంటే 5808, అలాగే మొత్తం పురుషు ఓటర్లలో 30.57 శాతం అంటే 7891 మంది ఓట్లు వేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో కేవలం 800 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేలా బల్దియా, ఎన్నికల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి మందకోడిగా సాగిన పోలింగ్ పదకొండు గంటల తర్వాత ఊపందుకుని, మళ్లీ ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు అంతంతమాత్రంగా కొనసాగింది. పోలింగ్‌కు చివరి గంట సమయం అంటే నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల వరకు 3.60 శాతం, పదకొండు గంటల కల్లా 7.26 శాతం, మధ్యాహ్నాం ఒంటి గంట వరకు 13.64 శాతం, మూడు గంటల వరకు 20.21 శాతం నమోదైన పోలింగ్ ఐదు గంటల కల్లా 27.31శాతానికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. 66 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే పోలీసులు, ఎన్నికల అధికారులు గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని లైవ్ వెబ్‌కాస్టింగ్ చేసినట్లు రిటర్నింగ్ అధికారి అనిల్ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలీసు, బల్దియా ఉన్నతాధికారులు పోలింగ్ బూత్‌ల వారీగా పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ముగిసిన తర్వాత పోలీసు బందోబస్తుతో బ్యాలెట్ బాక్సులను అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించినట్లు, 25న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.