హైదరాబాద్

25న మినీ జాబ్‌మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావ అకాశాలు కల్పించేందుకు ఈనెల 25న మరోసారి మినీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. 25న విజయనగర్‌కాలనీ సమీపంలోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధికల్పానాధికారి కార్యాలయ ఆవరణలో మేళాను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అపోలో ఫార్మసీ, క్యూస్ క్రాప్ ప్రైవేటు లిమిటెడ్, ఐడీబీఐ, ఫెడరల్ ఎల్‌ఐసీ, వసంత టూల్ క్రాప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, నేత అంబిట్ (గూగుల్ పే), ఆర్‌ఏసీ బిజినెస్ సపోర్టు సొల్యూషన్స్ వంటి పేరుగాంచిన ఏడు సంస్థల్లోని సుమారు 400 ఖాళీలను ఈ మేళాలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎం-్ఫర్మసీ, బీకాం, ఏదైనా పీజీ, బీటెక్ చదివి, 19 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావచ్చని సూచించారు. బయోడేటా, సర్ట్ఫికెట్ల ప్రతులతో ఈ మేళాకు ఉదయం పదిన్నర గంటలకు హాజరుకావాలని సూచించారు. అదనపు వివరాల కోసం సెల్ 8247656356లో టీ.రఘుపతిని సంప్రదించవచ్చని ఉపాధి అధికారి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.