హైదరాబాద్

ఒక్కో బూత్‌లో 800 ఓటర్లే ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: డబీర్‌పుర మున్సిపల్ వార్డు ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ బూత్‌లో 800 ఓటర్లు మాత్రమే ఉండాలని, ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. ఈ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలకుడు ఎ.వీరబ్రహ్మయ్యతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ మాట్లాడుతూ డబీర్‌పుర పరిధిలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కోసం ఇప్పటికే పోలీసులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి, బ్యాలెట్ బాక్సులను తనిఖీ చేశారు. డబీర్‌పుర ఎన్నిక పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా కూడా లోపాలు తలెత్తకుండా ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణనిచ్చినట్లు ఆయన తెలిపారు. 22న జరిగే పోలింగ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీలో అదనపు కమిషనర్ (ఎన్నికలు) జయరాజ్ కెనడీ, రిటర్నింగ్ అధికారి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ఓటరు దినోత్సవం సందర్భంగా
నేటి నుంచి జిల్లా స్థాయి పోటీలు

హైదరాబాద్, జనవరి 20: జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కు పట్ల ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వీలుగా మంగళవారం నుంచి ఎన్నికల సంఘం నిర్ణయించిన వివిధ అంశాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈనెల 21న నిర్వహిస్తున్న జిల్లి స్థాయి పోటీలకు ప్రతి సెగ్మెంట్ నుంచి వ్యాసరచన, వ్యక్తృత్వ, సీనియర్ కేటగిరీలో ముగ్గురు, జూనియర్ కేటగిరీలో ముగ్గురు చొప్పున మొత్తం 12 మందిని పంపాలని సూచించారు. ఈనెల 23న అన్ని అసెంబ్లీల పరిధిలో సీనియర్ సిటిజన్లతో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 24న జాతీయ స్థాయి పోటీలకు 33 జిల్లాల నంచి వచ్చే అభ్యర్థులకు చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లోని ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియంలో ప్రత్యేక వసతి ర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 25న రవీంద్రభారతిలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ ప్రసంగించి, విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. 25న ఉదయం ఎనిమిది గంటలకు ఎన్‌సీసీ స్కౌట్ అండ్ గైడ్, నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు, విద్యార్థులతో కలిసి లిబర్టీ క్రాస్ రోడ్డు నుంచి రవీంద్రభారతి వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈనెల 25న ఆసరా వాలంటీర్లతో ఎల్బీస్టేడియం నుంచి రవీంద్రభారతి వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు జయరాజ్ వెల్లడించారు. సమావేశంలో ఎన్నికల విభాగం జాయింట్ డైరెక్టర్ పంకజ పాల్గొన్నారు.