హైదరాబాద్

మోగిన ‘స్వైన్’సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిదరాబాద్: మహానగరంలో మళ్లీ స్వైన్‌ఫ్ల్యూ సైరన్ మోగింది. ప్రతి సంవత్సరం వాతావరణం బాగా చల్లబడిన సమయంలో ఈ వ్యాధి ప్రబలుతోంది. ఈసారి వ్యాధి తీవ్రత కొంత తగ్గిందని వైద్యులు భావించినా, స్వైన్‌ఫ్ల్యూ మళ్లీ పంజా విసిరింది. లక్షణాలతో చేరిన ఇద్దరు మహిళలకు స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయ్యిందని, మరో ముగ్గురు అనుమానిత లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రవణ్ కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన 67 ఏళ్ల వృద్ధురాలికి, మహబూబాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మరో మాహిళకు సైన్ ఫ్ల్యూ నిర్దారణ అయినట్లు, వారిద్దరు ప్రస్తుతం స్వైన్‌ఫ్ల్యూ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మరో ముగ్గురు వ్యక్తులు లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గిందని , గత సంవత్సరం ఇదే తేదీ నాటికి 18మంది స్వైన్‌ఫ్లూతో ఆసుపత్రిలో చేరారని చెప్పారు. గత సంవత్సరం మొత్తం 101 మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావటంతో చికిత్స అందించామని, అందులో 23 మంది మృతిచెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో చలి తీవ్రత తగ్గే అవకాశాలు ఉండటంతో స్వైన్‌ఫ్ల్యూ తీవ్రత కూడా మరింత తగ్గే అవకాశం ఉందని శ్రావణ్ కుమార్ తెలిపారు.