హైదరాబాద్

బౌలింగ్‌లో రాణించిన ఫాహిముద్దీన్ ఖాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న ఏ-3 డివిజన్ వనే్డ లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో నోబుల్ క్రికెట్ క్లబ్ మూడు వికెట్ల తేడాతో ప్రత్యర్థి కాస్మోస్ సీసీపై విజయం సాధించింది. కులికూతుబ్‌షా అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కాస్మోస్ సీసీ జట్టు 39.4 ఓవర్లలో 277 పరుగులు చేసి ఆలౌట్ అయంది. నోబుల్ క్రికెట్ క్లబ్ జట్టు కెప్టెన్, ఆల్‌రౌండర్ డాక్టర్ ఫాహిముద్దీన్ ఖాజా చక్కటి బౌలింగ్‌ను ప్రదర్శించి కేవలం 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీసుకోవడంతో కాస్మోస్ జట్టు బ్యాట్స్‌మెన్లు వెనువెంటనే పెవిలియన్ వైపుదారిపట్టారు. కాస్మోస్ జట్టు బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతూ 102 పరుగులు చేసి సీ.సిద్దార్థ్ 106 పరుగులతో సెంచరీ సాధించాడు. నోబుల్ సీసీ బౌలర్ అశ్విన్ సూరజ్ 38 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన నోబుల్ క్రికెట్ క్లబ్ 34.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని అధిగమించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన యాష్ జైన్ 102 పరుగులతో సెంచరీ సాధించగా, బీ.అంబారీష్ 62 పరుగులతో నాట్ ఔట్‌గా నిలిచాడు.