హైదరాబాద్

21న రిజర్వేషన్ పాలసీపై జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళిత, గిరిజన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు ఈనెల 21న రవీంద్రభారతిలో రిజర్వేషన్ పాలసీ, అట్రాసిటి యాక్ట్ - ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్ట్సీ అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మహేశ్వర రాజు తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాయకులు కే.యాదగిరి, దయానంద్, అంబేద్కర్, మదన్‌బాబుతో కలసి సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తయినా దళిత, బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం ఇప్పటికీ అందని ద్రాక్షలాగా మారిందని అన్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివక్షతో ఆయా వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. దళిత, గిరిజన, బడుగు వర్గాలకు చెందిన ప్రజలకు న్యాయం చేసేందుకు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు అధ్యక్షతన జరిగే సమావేశానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, తావర్ చంద్ గెహ్లాట్ హాజరవుతారని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ఖైరతాబాద్, జనవరి 19: చాలీచాలని వేతనాలతో కడు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న తమ జీవితాలు బాగు చేయాలని సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మొరపెట్టుకున్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కాంటిజెంట్ స్వీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయ్య తమ గోడును మీడియాకు విన్నవించుకున్నారు. సుమారు 30 ఏళ్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. రూ.150 వేతనంతో విధుల్లో చేరిన తమకు ప్రస్తుతం రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయని కన్నీరుపెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలకు గురైన తమ జీవితాలు రాష్ట్ర ఏర్పాటు అనంతరం బాగు పడతాయని భావించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వం వివిధ వర్గాలకి అందిస్తున్న పెన్షన్ల కంటే హీనంగా తమ వేతనాలు ఉన్నాయని, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా వేతనాలు అందడం లేదని తెలిపారు. ఆరు ఏళ్లుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు పలు మార్లు ప్రయత్నించినా అవకాశం దక్కలేదని విచారం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలలను నిత్యం శుభ్రం చేస్తున్న తమ జీవితాలు మాసక బారిపోతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు యాదయ్య, వీరస్వామి, నర్సింహులు, సయ్యద్ అలీం పాల్గొన్నారు.